close
Choose your channels

'డేర్' ఆడియో ఆవిష్కరణ

Tuesday, July 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌వీణ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్ .క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్. రామారావు నిర్మిస్తోన్న చిత్రం ` డేర్`. న‌వీన్ అనే కొత్త కుర్రాడు హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. కె. కృష్ణ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జి.ఆర్. న‌రేన్ సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ సార‌థి స్టూడియో లో జ‌రిగింది. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌ల‌య్యాయి.
అనంత‌రం చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, ` ఆద్యంత ఆస‌క్తిక‌రంగా సాగే సినిమా ఇది. న‌వీన్ కొత్త కుర్రాడైనా చ‌క్క‌గా న‌టించాడు. మిగ‌తా ప్యాడింగ్ కూడా బాగుండ‌టంతో మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. పాట‌లు, ఫైట్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయి. అన్ని ప‌నులు పూర్తిచేసి త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
నిర్మాత రామారావు మాట్లాడుతూ, ` క‌థానుగుణంగా చ‌క్క‌ని పాట‌లు కుదిరాయి. స‌దా చంద్ర మంచి పాట‌లు రాశారు. వాటికి న‌రేన్ మంచి ట్యూన్స్ తో అంద‌ర్ని ఆక‌ట్టుకునే లా కంపోజ్ చేశారు. సినిమాకు పాట‌లు పెద్ద అస్సెట్ అవుతాయి. అలాగే రాఘ‌వ మాట‌లు చ‌క్క‌గా రాశారు. న‌వీన్ న‌ట‌న ప్ర‌శంస‌నీయం. జీవా, సుమ‌న్ శెట్టిల న‌ట‌న సినిమాకు అద‌న‌పు బ‌లం. సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.
హీరో న‌వీన్ మాట్లాడుతూ, ` టీమ్ అంతా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి ప‌నిచేశాం. మంచి అవుట్ ఫుట్ వ‌చ్చింది. కెమెరా ప‌నిత‌నం హైలైట్ గా ఉంటుంది. విజువ‌ల్స్ బాగున్నాయి. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని డేర్ గా చెప్ప‌గ‌ల‌ను` అని అన్నారు.
ఇత‌ర పాత్ర‌ల్లో జీవా, మ‌ధు, సుమ‌న్ శెట్టి, నారి, రాఘ‌వ‌, పొట్టి మ‌ధు, సురేష్ , ప‌ల్ల‌వి, జ్యోతి, సుహాసిని, అనూష రెడ్డి, సాక్షి, మేఘ‌న‌, త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మాట‌లు: రాఘ‌వ‌, పాట‌లు: స‌దా చంద్ర‌, ఫైట్స్: దేవ‌రాజ్, కొరియోగ్ర‌ఫీ, తాజ్ ఖాన్, ఎడిటింగ్: పాపారావు, ఛాయాగ్ర‌హ‌ణం: ద‌ంతు వెంక‌ట్, సంగీతం: జి.ఆర్. న‌రేన్, నిర్మాత ఎస్: రామారావు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: కె. కృష్ణ ప్ర‌సాద్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.