విద్యుత్ రంగానికి చీకటి రోజులు - చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


2019-24 మధ్య విద్యుత్ రంగానికి చీకటి రోజులని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన విద్యుత్ రంగాన్ని 9 నెలల్లోనే గాడిన పెట్టినట్టు వెల్లడించారు. గత పాలకుల విధ్వంసం వల్ల ఆ రంగంలో వ్యవస్థలో అంతుబట్టని సమస్యలు ఉన్నాయని.. 30 ఏళ్లుగా నా మనసుకు దగ్గరగా ఉండే విభాగం ఇంధనరంగంమని.. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు..
"క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించాక రూ.5.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నాం. దీని ద్వారా రాష్ట్రంలోని 3.66 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పాం...ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.5.16 నుంచి రూ.4.80కి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం." అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
శాసనసభలో విద్యుత్ రంగంపై ప్రసంగించిన సీఎం.. రైతుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసి పగటిపూటే 9 గంటల విద్యుత్ ఇచ్చామన్నారు.
"ప్రపంచమంతా అధ్యయం చేశాను. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనే. అప్పుడు నన్ను ప్రతిపక్షాలు ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు. అయినా ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ మాట పడ్డాను. 1995లో 10 నుంచి 15 గంటలదాకా విద్యుత్ కోతలు ఉండేవి. 1998లో సంస్కరణలు దేశంలోనే మొట్టమొదటి సారి తెచ్చాం. ఎనర్జీ ఆడిటింగ్ విధానం తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్ మిషన్ కమిటీలుగా విభజించాం. కరెంట్ కొరతలను 2004 నాటికి అధిగమించాం. కరెంట్ కొరతలేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశాం. ఆ ఫలితాలు చూసి సంతోషించా. కానీ అవి ప్రజలకు అర్థంకాకపోవడం 2004లో ఓడిపోవడానికి కారణం అయింది. రాష్ట్రానికి లాభాలు వచ్చాయి...నాకు కష్టాలు వచ్చాయి."
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేస్తామని, సాధ్యాసాధ్యాలు పరిశీలించి విద్యుత్ బిల్లులు తగ్గిస్తామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments