అక్కినేని అఖిల్ కి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి స‌ల‌హా..!

  • IndiaGlitz, [Wednesday,September 21 2016]

అక్కినేని అఖిల్ హీరోగా న‌టించిన తొలి చిత్రం అఖిల్ ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేద‌న్న విష‌యం తెలిసిందే. ఈసారి ఎలాగైనా స‌రే స‌క్సెస్ సాధించాల‌ని అఖిల్ రెండో సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అఖిల్ త‌దుప‌రి చిత్రాన్ని విక్ర‌మ్ కుమార్ తో చేయ‌నున్న‌ట్టు నాగార్జున ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే...ప్రేమ‌మ్ ఆడియో ఫంక్ష‌న్ కి ముఖ్య అతిథిగా హాజ‌రైన ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి మాట్లాడుతూ...అక్కినేనితో 27 సినిమాలు చేస్తే అందులో 22 ప్రేమ‌క‌థా చిత్రాలే. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అక్కినేని కుటుంబం. ప్రేమ‌కు అర్ధం అక్కినేని కుటుంబం. నాగార్జున‌తో ఆ చ‌రిత్ర పున‌రావృతం అయ్యింది. ఇప్పుడు చైత‌న్య తో కంటిన్యూ అవుతుంది. అఖిల్ తో కూడా ఈ చ‌రిత్ర కంటిన్యూ అవ్వాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు ఉన్న చ‌రిత్ర ఏ సినిమాకు ఉండ‌దు. అందుచేత అఖిల్ కూడా త‌దుప‌రి చిత్రం ప్రేమ‌క‌థా చిత్ర‌మే చేయాల‌ని కోరుకుంటున్నాను అంటూ స‌ల‌హా ఇచ్చారు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి..!

More News

ప్రేమ‌మ్ ట్రైల‌ర్ క్రియేటివిటీ అదిరింది..!

నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ప్రేమ‌మ్. గోపీ సుంద‌ర్, రాజేష్ మురుగేష‌న్ సంగీతం అందించిన ప్రేమ‌మ్ ఆడియో వేడుక‌లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేసారు.

హీరోయిన్ తో చైతు ప్రేమను బయటపెట్టిన దాసరి..!

అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న ప్రేమకథా చిత్రం ప్రేమమ్.

పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకున్న హీరోయిన్ యామిని భాస్కర్

తెలుగులో కీచక,టైటానిక్ చిత్రాలతో పాటు తమిళంలో మున్నోడి వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ యామినీ భాస్కర్.

నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ప్రేమమ్ బిగ్ అవుతుంది - దర్శకరత్న దాసరి

అక్కినేని నాగ చైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమమ్.ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంగీత ప్రియులకు షాక్ ఇచ్చిన ఝాన్సీ..!

సీనియర్ యాంకర్ ఝాన్సీ ఒక్క సంగీత ప్రియులకే కాదు అందరికీ షాక్ ఇచ్చింది.ఇంతకీ విషయం ఏమిటంటే...