ఎవరిపై పోటీనో అర్థం కావడం లేదు - దాసరి నారాయణరావు

  • IndiaGlitz, [Monday,October 12 2015]

గుణశేఖర్ దర్శక నిర్మాతగా గుణాటీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం రుద్రమదేవి'. అక్టోబర్‌ 9న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌ సాధిస్తుంది. ఈ సినిమాని చూసిన దాసరి నారాయణరావు చిత్రయూనిట్‌ ను అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో

దాసరి నారాయణరావు మాట్లాడుతూ .... తెలుగు సినిమా ఫైట్స్, సాంగ్స్ అంటూ కమర్షియల్‌ సినిమాు వెంబడి ఇండస్ట్రీ పరుగు తీస్తున్న తరుణంలో హిస్టారికల్‌ సినిమా తీయానుకోవడం సాహసం. అల్లూరి సీతారామరాజు' మన ఆంధ్రు చరిత్ర. అలాగే 1987లో కృష్ణంరాజు నిర్మాణంలో నేను డైరెక్ట్‌ చేసిన తాండ్రపాపారాయుడు' ఒక చరి త్రే. ఆ సినిమా తర్వాత మరే హిస్టారికల్ మూవీ రాలేదు. 28 ఏళ్ళ తర్వాత వచ్చిన హిస్టారికల్‌ చిత్రమే రుద్రమదేవి'. ఇటువంటి సినిమా తీయానే ఆలోచన వచ్చినందుకు గుణశేఖర్ ను అభినందిస్తున్నాను. ఇప్పట్లో నేను కూడా ఇటువంటి ఆలోచన చేసేవాడిని కాను. దర్శకత్వంతో పాటు గుణశేఖర్‌ తనకు తాను నిర్మాతగా మారి ఈ సినిమాని నిర్మించడం గొప్ప విషయం.

ఇలాంటి సినిమాను ఎంకరేజ్‌ చేయాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిపైనా ఉంది. రుద్రమదేవి స్ఫూర్తితో ఇటలీలో రాణి పాలించింది. తర్వాత ఎందరో మహిళలు పరిపాలించారు. ఇలాంటి చారిత్రాత్మక చిత్రాన్ని చేసినందుకు గుణశేఖర్ ను అభినందిస్తున్నాను. రుద్రమదేవి చిత్రంతో అనుష్క సావిత్రి, జయసుధ, జమున లాంటి మహానటుల సరసన అనుష్క కూడా చేరిందని గట్టిగా చెప్పగను. అనుష్క లేకపోతే రుద్రమదేవి' సినిమాలేదు. తన లైఫ్‌టైమ్‌లో ఒకసారి మాత్రమే చేయగల సినిమా ఇది. ఇలాంటి సినిమాని చేసినందుకు తనని అభినందిస్తున్నాను. బన్ని గోనగన్నారెడ్డి పాత్ర నచ్చి తనకు తానుగా ముందుకు వచ్చి చేసిన సినిమా. గోనగన్నారెడ్డి పాత్రలో బన్ని అద్భుతంగా నటించాడు. తను వయసులో చిన్నవాడు కాబట్టి తనని ఎక్కువగా పొగడకూడదు. తను నటించిన ప్రతి సీన్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. బన్ని చాలా గొప్పగా చేశాడు. అలాగే కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్‌, రానా ఇలా ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. ఇటువంటి సినిమాను ఎంకరేజ్‌ చేయాల్సిన బాధ్యత అందరిదీ. ఇలాంటి సినిమాకు రెండు వారాలు గ్యాప్‌ ఇవ్వాలి. కానీ అలా కాకుండా వెంటనే పెద్ద హీరో సినిమా వేస్తున్నారు. దీనివల్ల ఎవరు బాగుపడుతున్నారో నాకు తెలియడం లేదు. ఈ పోటీ ఎంత వరకు సమంజసమో తెలియడం లేదు. సినిమా మంచి కలెక్షన్స్‌ సాధిస్తుంది. తొలిరోజు 9కోట్ల 40క్షు, రెండో రోజు 6 కోట్ల 20క్షు, మూడో రోజు 6కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఇంత మంచి చిత్రాన్ని రూపొందించిన యూనిట్‌ను అభినందిస్తున్నాను'' అన్నారు.

గుణశేఖర్‌ మాట్లాడుతూ దాసరిగారి సినిమాలను చూసి పెరిగాను. దాసరిగారు చేయని జోనర్‌ మూవీ లేదు. ఆయన దర్శకత్వంలో 1987 తర్వాత విడుదలైన తాండ్రపాపారాయుడు తర్వాత విడుదలైన హిస్టారికల్‌ మూవీ రుద్రమదేవి'.అలాంటి గొప్ప దర్శకుడు మా చిత్రాన్ని మెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది. ఆయనకు థాంక్స్‌'' అన్నారు.

అనుష్క మాట్లాడుతూ దాసరి లాంటి గొప్ప దర్శకు మా చిత్రాన్ని అభినందించినందుకు ఆయనకు థాంక్స్‌. ఈ సినిమాకోసం పడ్డ కష్టమంతా మరచిపోయాం. రుద్రమదేవి' చిత్రాన్ని ఎంకరేజ్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అన్నారు.

ఈ కార్యక్రమంలో రాగిణీ గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి తదితయి పాల్గొన్నారు.

More News

దాసరి వెర్షెస్ చరణ్..

దర్శకరత్న దాసరి నారాయణరావు...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... వీళ్లిద్దరిమధ్య గతంలో కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బ్రూస్ లీ రిలీజ్ విషయమై దాసరి, చరణ్ ల మధ్య మరోసారి కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పవచ్చు.

కొత్త సినిమాతో విక్రమ్ కి పాత రోజులు

విక్రమ్ సినిమాలంటే కేవలం ప్రయోగాత్మకమే అనుకుంటే పొరపాటు.మాంచి మాస్ మూవీస్ కూడా తన ఖాతాలో ఉన్నాయి.

'బ్రూస్ లీ ద ఫైటర్' సెన్సార్ పూర్తి...

రామ్ చరణ్,సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల లతో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి ''డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.'' పతాకం పై శ్రీమతి డి.పార్వతి సమర్పణలో నిర్మించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం‘బ్రూస్ లీ ద ఫైటర్’.

కళ్యాణ్ రామ్ షేర్ ఆడియో రిలీజ్ విశేషాలు..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిఖార్జున్ తెరకెక్కించిన చిత్రం షేర్. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహన్ నటించారు. ఈ చిత్రాన్ని విజయలక్ష్మి పిక్చర్స్ పతాకం పై కొమర వెంకటేష్ నిర్మించారు.

ఊటీలో 'బ్రహ్మోత్సవం'?

'శ్రీమంతుడు'.. మహేష్ బాబు కి కొత్త ఉత్సాహాన్నిచ్చిన చిత్రమిది. 80 కోట్లకి పైగా షేర్ పొందిన ఈ సినిమా విజయంతో.. మహేష్ తన కొత్త చిత్రం 'బ్రహ్మోత్సవం'ని మరింత జనరంజకంగా అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.