దాసరి ఆశయాలకు కొనసాగింపుగా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్

  • IndiaGlitz, [Sunday,February 17 2019]

స్వర్గీయ దాసరి ఆశయాలకు కొనసాగింపుగా ఏర్పాటైన 'దాసరి టాలెంట్ అకాడమీ' 2019 సంవత్సరానికి గాను షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రకటించింది. ఈ వివరాలు ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. జ్యూరీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ, దాసరి టాలెంట్ అకాడెమీ వ్యవస్థాపకులు బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, జ్యూరీ మెంబర్స్ ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, సీనియర్ రైటర్ రాజేంద్రకుమార్ పైడిపాటి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎస్.మల్లిఖార్జునరావు (పద్మాలయ మల్లయ్య) పాల్గొన్నారు.

మానవ సంబంధాలు, మానవీయ విలువల నేపథ్యంలో 15 నిమిషాల నిడివి తో షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాలని, ప్రధమ బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా 50 వేలు, మూడవ బహుమతిగా 25 వేలుతో పాటు..

మొదటి జ్యూరీ అవార్డు 25 వేలు, రెండవ జ్యూరీ 15.000/-, ఉత్తమ దర్శకుడు 20.000/-, ఉత్తమ కథా రచయిత 10.000/-, ఉత్తమ నటుడు 10,000/-, ఉత్తమ నటి 10.000/- చొప్పున నగదు బహుమతులు 'నీహార్ ఈ సెంటర్' సౌజన్యంతో అందజేస్తామని బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ తెలిపారు. మార్చి 30 వరకు షార్ట్ ఫిల్మ్స్ స్వీకరిస్తామని, మే 5న బహుమతీ ప్రదాన సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

దాసరికి అత్యంత సన్నిహితులైన సూర్యనారాయణ చేపట్టిన ఈ పోటీకి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రాజా వన్నెం రెడ్డి, రాజేంద్రకుమార్, పద్మాలయ మల్లయ్య పేర్కొన్నారు. ఈ పోటీకి నగదు బహుమతులు అందించేందుకు ముందుకొచ్చిన 'నీహార్ ఈసెంటర్' వారిని వారు అభినందించారు. మరిన్ని వివరాలకు
Dasaritalentacademy.org లో లాగిన్ అవ్వాల్సిందిగా సూచించారు!!

More News

రెండో సినిమాకు సైన్ చేసిన శివ కందుకూరి

పెళ్లి చూపులు సినిమాతో జాతీయ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు.

ఎన్టీఆర్ మహానాయకుడులో 'మహా' మిస్టేక్.. తేడా కొట్టేసిందిగా!?

దివంగత ముఖ్యమమంత్రి, ఆంధ్రుల అన్నగారు నందమూరి తారకరామారావు బయోపిక్ తీయాలని గత ఏడాది దర్శకులు పోటీపడిన సంగతి తెలిసిందే.

వెంక‌టేష్ హీరోయిన్ మారింది...

విక్ట‌రీ వెంక‌టేష్ ఈ సంక్రాంతికి `ఎఫ్‌2`తో విక్ట‌రీ కొట్టి మంచి ఊపు మీదున్నాడు. ఈ నెల 22 నుండి రాజ‌మండ్రిలో జ‌ర‌గ‌బోయే `వెంకీమామ‌`తో బిజీ కానున్నాడు.

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో చైతు రోల్‌...

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు మ‌జిలీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మేన‌మామ విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `వెంకీ మామ‌`లో న‌టించ‌నున్నాడు.

న‌రేంద్ర మోది.. వెబ్‌సిరీస్‌

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోది జీవితాన్ని `పిఎం న‌రేంద్ర‌మోది` చిత్రంగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.