చిన్నపాటి యుద్ధానికి వేదికగా మారిన గాంధీభవన్..

  • IndiaGlitz, [Tuesday,September 08 2020]

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ మీటింగ్ నిర్వహించాలన్నా.. గాంధీభవన్‌లోనే నిర్వహిస్తుంటారు. కానీ ఈ మధ్య గాంధీభవన్ బాహాబాహీలకు.. దూషణ పర్వాలకు వేదికవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. నేడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించేందుకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా హాజరయ్యారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా నేతలంతా విషెస్ చెప్పి ఫస్ట్ పార్ట్ సందడి సందడిగా నడిచింది.

కాసేపటికే రచ్చ స్టార్ట్.. అధికార ప్రతినిధులైన దాసోజు శ్రవణ్, నిరంజన్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం.. ఆపై చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఇద్దరూ ఒకరిపై మరొకరు.. మాటల తూటాలు పేల్చుకోవడమే కాకుండా.. కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్రమత్తమై ఇద్దరిని శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాంధీభవన్‌లో ఇలాంటి రచ్చ జరగడం కొత్తేమీ కాదు. గతంలో పార్టీ సీనియర్ నేత వీహెచ్‌కు మరో నేతకు మధ్య ఇలాంటి ఘటనే జరిగింది.

దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన పార్టీ.. మహామహులు నడిపిన పార్టీ.. అటు దేశంలోనూ.. ఇటు.. రాష్ట్రాల్లోనూ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ వచ్చిందంటే మాత్రం కాంగ్రెస్ పార్టీయే కారణం. దశాబ్దాల పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండాలి? కానీ ఎలా ఉంది? దీనికి ముఖ్య కారణం తెలంగాణ కాంగ్రెస్ నేతలేననడంలో ఏమాత్రం సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థిగా మారలేకపోతోంది. ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నా కూడా దానిని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతోందని నిపుణులు చెబుతున్నారు.

More News

'డిటెక్టివ్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన విశాల్‌

హీరో , నిర్మాత అయిన విశాల్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన చిత్రం డిటెక్టివ్ 2. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ రిలీజ్ చేసిన `రాధాకృష్ణ` చిత్రంలోని `తంగేడు పువ్వు` లిరిక‌ల్ వీడియో సాంగ్‌

``తంగేడు పువ్వులాంటి  నా బుగ్గ‌మీద నా సిందూరం పూసిండే  సిల‌కో... గుళ్ళోన గంట‌లాంటి నా గొంతు మీద‌నా మౌనాలు చ‌ల్లిండే మొల‌కో..నీలాల క‌న్నుల్లో మెరుపున్నోడే

కంగ‌నాకు షాకిచ్చిన సినిమాటోగ్రాఫ‌ర్‌

ఓ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌కు షాకిచ్చాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పుకొచ్చాడు.

రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చిన రాజీవ్‌, సుమ క‌న‌కాల‌

టాలీవుడ్ టాప్ యాంక‌ర్ ఎవ‌ర‌న‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చే పేరు సుమ క‌న‌కాల‌.

ఈ డైరెక్ట‌ర్‌కి కొరియ‌న్ రీమేక్ క‌లిసొస్తుందా..!

కొంత మంది డైరెక్ట‌ర్స్‌కు ఎంత మంచి టాలెంట్ ఉన్నా కాలం కలిసి రాక..స‌క్సెస్‌లు ద‌క్క‌వు.