ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన వార్నర్


Send us your feedback to audioarticles@vaarta.com


ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య టాలీవుడ్ సినిమా రంగంపై మోజు పెంచుకున్నాడు. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లోని సాంగ్స్‌కు డ్యాన్స్, డైలాగ్స్‌కు పెదవి కలిపిన వార్నర్ అభిమానులతో నిత్యం సోషల్ మీడియాలో ముచ్చటిస్తున్నాడు. కరోనా కారణంగా యావత్ క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయినా వార్నర్ మాత్రం టిక్ టాక్ వీడియోలతో అభిమానులతో అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, క్రీడాభిమానులు ఆయనకు ఫిదా అయిపోయారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే-20న. అయితే తాను అమితంగా అభిమానించే ఎన్టీఆర్‌కు పుట్టిన రోజు విషెస్ చెప్పాలని వార్నర్‌ను వీరాభిమాని అడిగాడు. ఆయన కోరిక మేరకు వార్నర్ రియాక్ట్ కూడా అవ్వడంతో పాటు జూనియర్‌కు విషెస్ చెప్పాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు చూద్దాం.
అభిమాని : డేవిడ్ భాయ్.. రేపు నా ఫేవరెట్ హీరో తారక్ పుట్టినరోజు. అతనికి మీరు విషెస్ చెప్పగలారా..!?
వార్నర్ : హ్యాపీ బర్త్ డే బడ్డీ అంటూ ట్వీట్ చేసి ఆ అభిమానిని సంతోష సాగరంలో ముంచెత్తాడు. ఈ ట్వీట్ చేసిన జూనియర్ వీరాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కాగా.. సెలబ్రిటీస్ నుంచి ఫస్ట్ విషెస్ ఇంతవరకూ రాలేదు. అంటే ఫస్ట్ విషెస్ చెప్పిన సెలబ్రిటీ వార్నర్ అన్న మాట.
Happy birthday buddy https://t.co/7Dt9dszTzu
— David Warner (@davidwarner31) May 19, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.