2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలను జారీ చేసిన డీసీజీఐ

  • IndiaGlitz, [Tuesday,June 01 2021]

క‌రోనాకు బ్రహ్మాస్త్రంలా పనిచేసే 2డీజీ ఔషధం ఇటీవలే అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పొడి రూపంలో అందుబాటులోకి వ‌చ్చిన ఈ ఔష‌ధం.. ఒక మోస్తరు నుంచి తీవ్ర ల‌క్ష‌ణాలు ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు అద్భుతంగా పని చేస్తుందని డీఆర్డీవో చెప్పింది. తాజాగా ఈ 2డీజీ ఔషధాన్ని ఎలా వాడాలో చెబుతూ డీసీజీఐ మార్గ‌ద‌ర్శ‌కాలను విడుద‌ల చేసింది. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఈ మందును వాడాల‌ని స్ప‌ష్టం చేసింది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల‌కు ఇస్తున్న చికిత్స‌కు అనుబంధంగా ఈ ఔష‌ధం అత్య‌వ‌సర వినియోగానికి డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది.

2డీజీ ఔషధం వినియోగానికి మార్గదర్శకాలు..

  • కొవిడ్ పేషెంట్లకు ఇస్తున్న చికిత్సకు అనుబంధంగా 2 డీజీ ఔషధాన్ని వినియోగించాలి.
  •  
  • మోస్త‌రు నుంచి తీవ్ర కొవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అంటే గరిష్టంగా 10 రోజుల లోపు వైద్యులు ఈ మందును పేషెంట్‌కు సూచించాల్సి ఉంటుంది.
  •  
  • నియంత్ర‌ణ లేని డ‌యాబెటిస్‌, తీవ్ర‌మైన‌ గుండె జ‌బ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డే వారిపై ఈ ఔష‌ధాన్ని ఇంకా పూర్తిగా ప‌రీక్షించబడలేదు. అందువ‌ల్ల కాస్త ముందు జాగ్ర‌త్త అవ‌స‌రం.
  •  
  • ఈ 2డీజీ ఔష‌ధాన్ని గ‌ర్భిణులు, బాలింత‌లు, 18 ఏళ్ల లోపు పేషెంట్ల‌కు ఇవ్వ‌కూడ‌దు.
  •  
  • 2DG@drreddys.comకు మెయిల్ చేయ‌డం ద్వారా హైద‌రాబాద్‌లోని డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ను 2డీజీ ఔష‌ధం స‌ప్లై చేయాల‌ని పేషెంట్లు, వాళ్ల అటెండ‌ర్లు ఆయా హాస్పిట‌ల్స్‌ను కోర‌వ‌చ్చు.

More News

మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ మంగళవారం క‌న్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఎస్వీ ప్ర‌సాద్‌ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఆయనతోపాటు ఆయన కుటుంబ

పాక్ భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు విడుదల

పాకిస్తాన్‌లో భద్రతా దళాలకు చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. ఇవాళ ప్రశాంత్ హైదరాబాద్ చేరుకోనున్నాడు. 2017 ఏప్రిల్ నెలలో ప్రశాంత్ అదృశ్యమయ్యాడు.

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం

ఛత్తీస్‌గఢ్ బాటలోనే ఢిల్లీ ప్రభుత్వం కూడా నడుస్తోంది. సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా కట్టడి నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న

బాలకృష్ణకు నచ్చని కథతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 'సింహాద్రి' సినిమాది స్పెషల్ ప్లేస్. అప్పటికి 'ఆది' లాంటి సక్సెస్ ఖాతాలో పడినా ఏదో వెలితి. దానికి ముందు 'సుబ్బు', తరువాత 'అల్లరి రాముడు', 'నాగ' ప్లాప్స్ ఎఫెక్ట్ ఉంది.

దేశంలో 54 రోజుల కనిష్టానికి కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి క్రమక్రమంగా అదుపులోకి వస్తోంది. 54 రోజుల కనిష్టానికి కేసుల సంఖ్య చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి..