close
Choose your channels

బాలీవుడ్‌కి వెళుతున్న కామ్రేడ్‌

Wednesday, July 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్‌కి వెళుతున్న కామ్రేడ్‌

విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టించిన `అర్జున్‌రెడ్డి` బాలీవుడ్‌లో `క‌బీర్‌సింగ్` పేరుతో రీమేక్ అయ్యి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. ఇప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ ప్ర‌జెంట్ మూవీ `డియ‌ర్ కామ్రేడ్‌`పై బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ క‌న్నుప‌డింది. నిర్మాత న‌వీన్ ఎర్నేని, హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు భ‌ర‌త్‌క‌మ్మ‌తో క‌లిసి `డియ‌ర్ కామ్రేడ్‌` సినిమా చూసిన క‌ర‌ణ్ జోహార్ సినిమాను రీమేక్ చేయాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

``ఇప్పుడు సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక అద్భుతంగా న‌టించారు. గొప్ప ప్రేమ‌క‌థ‌. సినిమా మ‌నల్ని క‌దిలిస్తుంది. అంతే కాకుండా మంచి మెసేజ్ కూడా ఇస్తుంది. ఈ సినిమాను రీమేక్ చేయ‌బోతున్నామ‌ని చెప్ప‌డానికి సంతోషిస్తున్నా`` అంటూ క‌ర‌ణ్ జోహార్ పోస్ట్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.