వరంగల్ కామాంధుడి పాపం పండింది.. ఉరిశిక్ష!

  • IndiaGlitz, [Thursday,August 08 2019]

వరంగల్ జిల్లా హన్మకొండలో చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకుని ఇన్ని రోజులు కస్టడీలో ఉంచారు. ఈ కేసును నిశితంగా పరిశీలించి విచారించిన వరంగల్ కోర్టు నిందితుడు ప్రవీణ్‌కు విధిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది. కాగా ఈ కేసులో విచారణను 48రోజుల్లోనే పూర్తిచేసి సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు వరంగల్ ఫస్ట్ అడిషనల్ జడ్జ్ జయకుమార్. ఇది క్షమించరాని నేరం అనీ.. ముక్కుపచ్చలారని చిన్నారిపై రాక్షసుడిగా ప్రవర్తించి ఆమె ప్రాణాలు తీసిన నిందితుడికి బతికే హక్కే లేదని న్యాయమూర్తి చెప్పారు. మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జ్ జయకుమార్ ముందు ఈ కామోన్మాది నేరం అంగీకరించాడు. అయితే ప్రవీణ్‌కు న్యాయవాదులు సహాయ నిరాకరించారు. కాగా.. నేరస్తుడికి ప్రభుత్వం తరపున ఒక న్యాయవాదిని జిల్లా న్యాయస్థానం సమకూర్చింది.

అసలేం జరిగింది..!

కాగా.. జూన్ 18వ తేదీన హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి, ఆ తర్వాత ప్రవీణ్ అనే కామోన్మాది హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. రాత్రి డాబాపై తల్లిదండ్రులతో కలిసి పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసులు పెట్టారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. 23 రోజుల్లోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. కోర్టులో జులై 24న ప్రారంభమైన విచారణ ప్రారంభం కాగా ఇవాళ నిందితుడికి మరణ శిక్ష విధించడం జరిగింది. ఇదిలా ఉంటే.. ప్రవీణ్‌ను దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం, ప్రజాసంఘాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఈ తీర్పుతో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని స్పష్టంగా అర్థమవుతోంది.

More News

అలీ ముఖంపై తన్నిన హిమజ!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-3 ఎపిసోడ్.. ఎపిసోడ్‌కు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. రోజురోజుకు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు రక్తి కట్టిస్తున్నారు.

శ్రీముఖి ప్లాన్ అట్టర్ ప్లాప్.. రవికి గాయాలు

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-3 ఎపిసోడ్.. ఎపిసోడ్‌కు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది.

'రాహు' చిత్రం ఫస్ట్ లుక్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం రాహు.

గ్రాండ్‌గా ‘బిజినెస్‌మెన్’.. ‘ది హంబుల్ కో’ లాంచింగ్!

అపారమైన జనాదరణ ఉన్న హీరోల్లో ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారన్న విషయం విదితమే. ఇందుకు ప్రత్యేకించి ఉదాహరణలు చెప్పనక్కర్లేదు.

భర్త గురించి షాకింగ్ విషయాలు చెప్పిన ‘ఐశ్వర్యరాయ్’!

ఐశ్వర్యరాయ్ అనగానే అందాల భామ, బాలీవుడ్ సుందరి ఐశ్వర్య అనుకునేరు.. ఆమె కాదండోయ్ బాబూ..