ప్రభాస్ సినిమాకి దీపిక ఇంతవరకూ అడ్వాన్స్ తీసుకోలేదట..

  • IndiaGlitz, [Friday,September 04 2020]

యంగ్ రెబల్ ప్రభాస్ హీరోగా ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపిక పదుకునే సైతం ఫిక్స్ అయిపోయింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం ఇప్పటికే వెలువడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. దీపిక ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా తీసుకోలేదట...

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సమయంలో దీపిక నెటిజన్లపై విరుచుకు పడింది. ఈ సినిమాను ప్రభాస్ 21గా పేర్కొనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాస్ తన 21వ చిత్రంలో చేస్తున్నాడని.. అంతేకానీ ఈ మూవీ పేరు ప్రభాస్ 21 కాదంటూ ట్వీట్ చేసింది. దీంతో షాకైన నెటిజన్లు కొందరు.. సినిమా పేరు ఫిక్స్ చేయనంత వరకూ సదరు హీరో చేస్తున్న సినిమా నంబర్‌తోనే చెప్తారని.. దానికంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీపిక అడ్వాన్స్ తీసుకోకపోవడానికి ఈ ఘటనకు ఏదైనా సంబంధం ఉందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అసలు కారణం వేరే ఉందని టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో అడ్వాన్స్ తీసుకోవడం మంచిది కాదని దీపిక భావించిందట. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై.. మార్కెటింగ్ స్టార్ట్ అయిన అనంతరం మాత్రమే రెమ్యునరేషన్ తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. ఇదే విషయాన్ని ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్‌కు కూడా చెప్పారని టాక్. దీంతో ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

More News

వైద్య సిబ్బందికి ప్యూమా టీ షర్టులు అందజేసిన కరీనా..

కరోనా మహమ్మారిపై యుద్ధంలో ఫ్రంట్‌లైన్‌లో ఉండి వైద్య సిబ్బంది సేవలందిస్తున్న విషయం తెలిసిందే.

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ కోయిల్‌లో బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. తాజాగా 83 వేలకు పైగా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

కేసీఆర్ నిర్ణయంపై ప్రశంసలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ నేతలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అటు ఏపీ నేతలు, ఇటు తెలంగాణ నేతలు సైతం కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘మా బంగారు తల్లి స్వప్నకి..’ అంటూ పవన్ ట్వీట్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్వప్న అనే యువతికి రెండు చేతులూ లేవు.