'ఛ‌పాక్' లో దీపికా ఫ‌స్ట్‌లుక్‌

  • IndiaGlitz, [Monday,March 25 2019]

రాజ‌ధాని ఢిల్లీలో ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌పై జ‌రిగిన యాసిడ్ దాడి అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నంగా మారింది. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ యాసిడ్ దాడికి కుంగిపోకుండా.. త‌న‌లా దేశంలో యాసిడ్ దాడికి గురైన మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు.

స్ఫూర్తి దాయ‌కంగా ఉన్న ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ మేఘ‌నా గుల్జ‌ర్‌. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె ఇందులో ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను, టైటిల్‌ విడుద‌ల ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. 'ఛ‌పాక్‌' పేరుతో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా షూటింగ్ నేటి నుండి ప్రారంభ‌మైంది. ఈ పాత్ర ఎప్ప‌టికీ నా మ‌దిలో నిలిచిపోతుంది. షూటింగ్ నేటి నుండే మొద‌లు అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు దీపికా ప‌దుకొనె. ఈ చిత్రం జ‌న‌వ‌రి 10, 2020లో విడుద‌ల కానుంది.