close
Choose your channels

అనుష్క పాత్రలో దీపికా ప‌దుకొనె

Monday, November 4, 2019 • తెలుగు Comments

అనుష్క పాత్రలో దీపికా ప‌దుకొనె

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి స్టార్ స్టేట‌స్‌ను ఇచ్చిన చిత్రం `అరుంధ‌తి`. 2009లో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ట‌య్యింది. ప‌దేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నారు. బాలీవుడ్‌లో అనుష్క పాత్ర‌లో దీపికా ప‌దుకొనె నటిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ముందుగా అనుష్క శ‌ర్మ‌, కరీనాక‌పూర్ వంటి వారి పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ దీపికా అయితే బావుటుంద‌ని మేక‌ర్స్ అనుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన రాలేదు.

ప్ర‌స్తుతం దీపికా చ‌పాక్ చిత్రంలో యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌గా న‌టిస్తుంది. దీనికి మేఘ‌నా గుల్జర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అలాగే 83 చిత్రంలో భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్ భార్య పాత్ర‌లో న‌టించారు. కాగా.. లేటెస్ట్‌గా మ‌హాభార‌త నేప‌థ్యంలోసాగే చిత్రంలో ద్రౌప‌దిగా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

అనుష్క విష‌యానికి వ‌స్తే చాలా గ్యాప్ త‌ర్వాత అనుష్క బాడీ స్లిమ్ చేసుకుని నిశ్శ‌బ్దం చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లోన‌టిస్తుంది. ఈ చిత్రంలో ఈమె సాక్షి అనే పాత్ర‌లో న‌టిస్తుంది. జ‌న‌వ‌రిలో ఈ సినిమా విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వినిప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. హేమంత్ మ‌ధుక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz