రీమేక్‌లో దీపిక‌

  • IndiaGlitz, [Tuesday,January 28 2020]

దీపిక ప‌దుకొనె త‌దుప‌రి చిత్రానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. హాలీవుడ్‌లో అన్నేహ‌తావే, రాబ‌ర్ట్ డి నీరో న‌టించిన చిత్రం ‘ది ఇంట‌ర్న్‌’. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నారు. ఇందులో దీపిక ప‌దుకొనెతో పాటు సీనియ‌ర్ న‌టుడు రిషి క‌పూర్ కూడా న‌టించ‌బోతున్నారు. ‘‘చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే 2021లో సినిమాను విడుద‌ల చేస్తాం’’ అని దీపిక ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనె లేడీ బాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని దీపికా ప‌దుకొనె నిర్మాణ సంస్థ క ప్రొడ‌క్ష‌న్స్‌, హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్‌, అజుర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాలు నిర్మిస్తున్నాయి.

ఈ జ‌వ‌న‌రిలో దీపికా ప‌దుకొనె ఛ‌పాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే భ‌ర్త ర‌ణ్వీర్‌తో క‌లిసి ఈమె న‌టించిన ‘83’ చిత్రం ఏప్రిల్ 10న విడుద‌ల కానుంది. ఈ సినిమా 1983లో ఇండియ‌న్ క్రికెట్ టీమ్ అసాధార‌ణ వ‌రల్డ్‌క‌ప్ గురించి తెలియ‌జేస్తుంది. ఇందులో కపిల్ పాత్ర‌లో ర‌ణ్వీర్ న‌టిస్తుండ‌గా..కపిల్ భార్య పాత్ర‌లో దీపికా ప‌దుకొనె న‌టిస్తున్నారు. ర‌ణ్వీర్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత వీరిద్ద‌రూ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.