close
Choose your channels

ర‌ణ‌వీర్‌తో న‌టించ‌లేద‌న్న దీపిక... 

Sunday, January 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌ణ‌వీర్‌తో న‌టించ‌లేద‌న్న దీపిక... 

1983లో ఇండియాకు క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సాధించి పెట్టిన క‌పిల్ సేన జ‌ర్నీ ఆధారంగా `83` సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తున్నారు. ర‌ణ‌వీర్ జత‌గా దీపికా ప‌దుకొనే.. క‌పిల్ భార్య రోమీ భాటియా పాత్ర‌లో నటిస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని .. త‌ను `83` చిత్రంలో న‌టించ‌డం లేద‌ని ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. దీపిక‌కు ఓ బ్రాండ్ ఉంద‌ని.. రోమీ బాటియాకు త‌క్కువ ప్రాధాన్యం ఉంది కాబ‌ట్టి.. ర‌ణ‌వీర్ సింగ్ అలాంటి పాత్ర‌ల్లో దీపికా నటించ‌లేర‌ని తెలిపారు. దీపికా యాసిడ్ బాధితరాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో.. మేఘ‌నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే `చ‌పాక్` చిత్రంలో న‌టించ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.