దీపిక స్పెషల్ సాంగ్....

  • IndiaGlitz, [Sunday,May 22 2016]

రీసెంట్ గా ట్రిపుల్ ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఆ సినిమా పూర్తి కావడంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించింది. సాధారణంగా బాలీవుడ్ లో హీరోయిన్స్ స్సెషల్, ఐటెం సాంగ్స్ లో నటిస్తుంటారు. దీపికా కూడా గతంలో దమ్ మారో దమ్ అనే స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఇప్పుడు రాబ్తా అనే బాలీవుడ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించడానికి రెడీ అవుతుందని సమాచారం. ప్రీతమ్ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సాంగ్ ను జూన్ లో చిత్రీకరిస్తారట.