దీపిక స్టింగ్ ఆపరేషన్.. ఉలిక్కిపడ్డ అధికారులు!

  • IndiaGlitz, [Thursday,January 16 2020]

స్టింగ్ ఆపరేషన్స్.. ఈ పేరు వింటే రాజకీయ నాయకులు ఉలిక్కిపడతారు. వీటిని పాత్రికేయలోకం ఎక్కువగా నిర్వహిస్తుంటుంది. సమాజంలో అవినీతిని వెలికి తీయడానికి.. ఈ ఆపరేషన్లు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే.. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ ఒకటి నిర్వహించింది. ఆమె నటించిన ఛపాక్ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో .. ఆమె నటన పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. దీపిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్.. ఇండస్ట్రీలోనే కాదు.. పోలీస్ శాఖలోనూ హాట్ టాపిక్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. యాసిడ్‌ అమ్మకాలపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. యాసిడ్ కొనాలంటే.. గుర్తింపు కార్డు కచ్చితంగా చూపాలి. షాపు యజమానికి అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే దీపిక స్టింగ్ ఆపరేషన్‌లో యజమానుల ఉదాసీనత బయటపడింది. ఎలాంటి గుర్తింపు పత్రాలు చూపకుండానే.. దీపిక అండ్ టీమ్ 24 యాసిడ్ బాటిల్స్‌ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని దీపిక తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా బయటపెట్టింది. వీడియోను కూడా పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అయ్యింది. దీపిక సీక్రెట్ ఆపరేషన్‌ను పలువురు అభినందిస్తున్నారు. మరోవైపు పోలీస్ శాఖ కూడా దీనిపై దృష్టి పెట్టినట్టు సమాచారం. యాసిడ్ అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించమని సంబంధింత అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

More News

పదేళ్ల కల నెరవేరింది.. కంగనా స్టూడియో రెడీ!

కంగనా రనౌత్.. పట్టుదలకు మారుపేరుగా.. బాలీవుడ్ క్వీన్‌గా తనకంటూ ప్రత్యేక సొంతం చేసుకున్న నటి. విభిన్న పాత్రలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పట్టు పట్టిందంటే.. నెగ్గేవరకు వదలదన్నది ఆమెకున్న పేరు.

మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. 2019-20 కాంట్రాక్ట్ జాబితాలో ధోనీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో అభిమానులు మండిపడుతున్నారు.

రైతులారా బాబును నమ్మొద్దు... మీకు న్యాయం చేసేది జగనే : తలసాని

ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏలూరు లో కోడి పందేలను చూసేందుకు వెళ్ళిన ఆయన...

సామాజిక న్యాయం మాతోనే సాధ్యం : బీజేపీ - జనసేన

ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ అవసరం చాలా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ లో బీజేపీ జనసేన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... మనస్ఫూర్తిగా బీజేపీ తో పొత్తు తో

అప్పుడు మద్దతిచ్చి .. ఇప్పుడు తరలిస్తామంటే చూస్తూ ఊరుకొం : పవన్

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్. అమరావతిని తరలించేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని.... కానీ అది సాధ్యం కాదని స్పష్టం చేశారు.