close
Choose your channels

ఆ సినిమాను స్టార్ట్ చేసిన దీపిక‌

Friday, February 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ సినిమాను స్టార్ట్ చేసిన దీపిక‌

దీపికా ప‌దుకొనె ఓ బ‌యోపిక్‌లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ బ‌యోపిక్ ప్ర‌ముఖ సెల‌బ్రిటీది మాత్రం కాదు. ఢిల్లీలో యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌ది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ట్లు చిత్ర డైరెక్ట‌ర్ మేఘ‌నా గుల్జార్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఓ ప‌సుపు చీర పోస్ట్ చేశారు. `ఛ‌పాక్‌` సిద్ధ‌మ‌వుతోంది అని రాశారు.

యాసిడ్ దాడి కార‌ణంగా ఈ చీర అక్క‌డ‌క్క‌డా కాలిపోయిన‌ట్లు క‌న‌ప‌డుతుంది. ఈ సినిమాలో దీపిక టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డ‌మే కాదు.. సినిమాను నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంటే ఈ స్క్రిప్ట్ దీపిక‌ను ఎంత‌గానో ఇన్‌స్పైర్ చేసిన‌ట్టు క‌దా!. ర‌ణవీర్‌తో పెళ్లి త‌ర్వాత దీపిక న‌టిస్తున్న తొలి చిత్ర‌మిది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.