పుకార్లే నిజమయ్యాయి, షణ్ముఖ్‏తో ఐదేళ్ల బంధానికి బ్రేకప్.. దీప్తి సునయన ఎమోషనల్ పోస్ట్

  • IndiaGlitz, [Saturday,January 01 2022]

యూట్యూబర్, టిక్‌టాక్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌కు బిగ్‌బాస్ ఏమాత్రం కలిసొచ్చినట్లుగా లేదు. తృటిలో బిగ్‌బాస్ టైటిల్‌ను చేజార్చుకున్న షన్మూ.. ఇప్పుడు పర్సనల్‌గానూ భారీగా లాసయ్యాడు. అతనితో ఐదేళ్ల ప్రేమ బంధానికి ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పారు. బిగ్‌బాస్ షో జరుగుతున్నప్పుడే వీరిద్దరి దారులు వేరైనట్లుగా విస్తృతంగా కథనాలు వచ్చాయి. కానీ వీటిని ఇద్దరూ స్పందించలేదు. కానీ బ్రేకప్‌కు దగ్గరగా వుండేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఈ పుకార్లను నిజం చేస్తూ ‘‘బ్రేకప్’’కు సంబంధించి దీప్తి సునయన అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. షణ్ముఖ్‌తో విడిపోతున్నామంటూ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి.

“‘ఎంతో ఆలోచించిన తర్వాత నేను, షణ్ముఖ్‌ పరస్పర అంగీకారంతో ప్రేమ బంధం నుంచి విడిపోయి.. మా దారులు మేము చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. బ్రేకప్‌ నిర్ణయం తమ మధ్య ఎంతోకాలంగా నడుస్తోంది. ఈక్రమంలోనే తామిద్దరం కలిసి ఉండటానికి ఎంతో ప్రయత్నించాం.. మా దారులు వేరని అర్థమైంది. ఇలాంటి క్లిష్ట సమయంలో మాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం. దయచేసి మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరని ఆశిస్తున్నాం’’ అని దీప్తి తన పోస్ట్‌లో తెలిపారు.

యూట్యూబ్‌, డబ్‌స్మాష్‌, టిక్‌టాక్‌ల వీడియోల కోసం దీప్తి-షణ్ముఖ్‌ మొదటిసారి కలిశారు. ఇద్దరూ మంచి డ్యాన్సర్లు కావడంతో సూపర్‌హిట్ సాంగ్స్‌కి అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. వీరి వీడియోలకు యువత బ్రహ్మారథం పట్టారు. ఈ జంటకు జనాల్లో సైతం విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అయితే దీప్తి- షణ్ముఖ్‌ల మధ్య వున్న స్నేహం.. ప్రేమగా మారింది. పలు షోలు, సోషల్‌ మీడియా లైవ్‌‌లలో సునయన అంటే తనకెంతో ఇష్టమని షణ్ముఖ్‌.. అదే మాదిరిగా షణ్ముఖ్‌ అంటే తనకు అమితమైన ప్రేమ అని ఆమె చెప్పుకొచ్చారు. ఐదేళ్ల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా సాగిన వీరి ప్రేమ.. త్వరలోనే పెళ్లిపీటలెక్కాల్సింది. కానీ అర్ధాంతరంగా వీరి బంధానికి తెరపడటం వారి అభిమానులను, ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది.

More News

శ్రీకాళహస్తిలో కంగనా రనౌత్ రాహుకేతు పూజలు

బాలీవుడ్ అగ్ర కథానాయిక, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

న్యూ ఇయర్ వేళ మెగా - నందమూరి అభిమానులకు చేదువార్త.. 'ఆర్ఆర్ఆర్' వాయిదా..?

అనుకున్నట్లుగానే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమను మరోసారి కష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందు పడ్డ

ఆర్ఆర్ఆర్ నుంచి 'రామం రాఘవం' సాంగ్... అల్లూరిగా నెత్తురు వేడెక్కించిన చరణ్

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' . సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా

లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది... ఇక రచ్చ రచ్చే

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మూవీలోని ‘‘లాలా భీమ్లా’’ సాంగ్ డీజే వర్షన్‌ను రిలీజ్ చేశారు. పాటను ప్రముఖ దర్శకుడు

శ్యామ్ సింగరాయ్‌ని వీక్షించిన బాలయ్య.. బాగా తీశారంటూ కితాబు

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘‘శ్యామ్ సింగరాయ్’’. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయగా..