పెళ్లి త‌ర్వాత తొలిసారి దీప్‌వీర్‌

  • IndiaGlitz, [Monday,January 07 2019]

బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌, హీరోయిన్ దీపికా ప‌దుకొనెలు గత ఏడాది న‌వంబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందు వీరిద్ద‌రూ క‌లిసి సినిమాల్లో న‌టించారు.

పెళ్లి తర్వాత ఇద్ద‌రూ క‌లిసి చేయ‌బోయే సినిమాకు రంగం సిద్ధం అవుతోంది. 1983 వ‌ర‌ల్డ్‌క‌ప్ సాధించిన భార‌త క్రికెట్ జ‌ట్టులో క‌పిల్ దేవ్ అండ్ టీం.. ఆ క‌ప్ సాధ‌న‌లో చేసిన ప్ర‌యాణం ఆధారంగా ఓ బ‌యోపిక్‌ను రూపొందించ‌బోతున్నారు.

దానికి రంగం సిద్ధ‌మ‌వుతోంది.. అందులో భాగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం ప్రకారం ఈ చిత్రంలో క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తున్నారు.

కాగా ఆయ‌న స‌తీమ‌ణి రోమీ భాటియా పాత్ర‌లో దీపికా ప‌దుకొనెను న‌టింప చేసే ఆలోచ‌న‌లో నిర్మాత‌లు సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. అంతా ఓకే అయితే పెళ్లి త‌ర్వాత ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనె క‌లిసి న‌టించ‌బోయే చిత్ర‌మిదే అవుతుంది.

More News

అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, యు.వి.క్రియేషన్స్ కుక్క‌లా..పందులా

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత‌లుగా రాణిస్తున్న అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, యు.వి.క్రియేష‌న్స్ వారిని నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని కుక్క‌లు అంటూ మాట్లాడాడు.

ఘనంగా రజినీకాంత్ 'పేట' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటిస్తున్న చిత్రం ' పేట'.. సిమ్రాన్ , త్రిష లు కథానాయికలు.... సాంగ్స్, ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల

బాల‌య్య‌ కామెంట్ 2 ...నాగ‌బాబు రిప్లై..

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను విమ‌ర్శించిన బాల‌కృష్ణ ఆరు సంద‌ర్భాల్లో త‌క్కువ చేస్తూ మాట్లాడ‌ర‌న్న నాగ‌బాబు. దానికి సంబంధించిన రెండో కామెంట్ వీడియో విడుద‌ల చేశారు.

విజ‌య్, అట్లీకి మూహూర్తం కుదిరింది. 

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ తన తదుపరి చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో చేయుబోతున్న సంగతి తెలిసిందే.

నిర్మాతల కోసం మ్యాస్ట్రో ముంద‌డుగు

ఇసై జ్ఞాని, మ్యాస్ట్రో ఇలా అందరూ వారి అభిమానానికి తగ్గట్లుగా ఇళయరాజాను పిలుచుకుంటూ ఉంటారు