Delhi Firecracker Ban : సైలెన్స్ ప్లీజ్.. ఢిల్లీలో బాణాసంచా కాల్పులపై ఈ ఏడాది కూడా నిషేధం

  • IndiaGlitz, [Wednesday,September 07 2022]

భారతీయులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగల్లో దీపావళి ముందు వరుసలో వుంటుంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి అంటే వెంటనే గుర్తొచ్చేది దీపాలు, టపాసులు. పట్టుబట్టలు ధరించి చిచ్చుబుడ్లు, కాకరపువ్వోత్తులు, బొంగరాలు, మతాబులు , లక్ష్మీ బాంబులు కల్చాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. పండుగకు కొద్దిరోజుల ముందు నుంచే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మారుతున్న కాలమాన పరిస్ధితులు, ముఖ్యంగా వాతావరణం పండుగ సరదాను దూరం చేస్తున్నాయి. దేశంలోని చాలా నగరాల్లో శబ్ధ, వాయు కాలుష్యాలను దృష్టిలో వుంచుకుని అక్కడ బాణాసంచా కాల్చడాన్ని ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయి. ప్రతి ఏడాది కొత్త నగరాలు ఈ లిస్టులో చేరుతున్నాయి.

తీవ్ర నిరాశలో ఢిల్లీ వాసులు :

ఈ లిస్టులో తొలి వరుసలో వుండే నగరం ఢిల్లీ. తొలి నుంచి ఇక్కడ వాయు కాలుష్యం ఎక్కువే. పీల్చే గాలి కూడా నాణ్యంగా వుండకపోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాలుష్యాన్ని నివారించేందుకు గత కొన్నేళ్లుగా ఇక్కడ దీపావళి నాడు బాణాసంచా కాల్పులను ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. జనవరి 1, 2023 వరకు నగరంలో బాణా సంచా కాల్పులను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. అన్ని రకాల టపాసుల ఉత్పత్త, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్చలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
 

More News

అన్నగారిలానే పవన్‌ది బలమైన ఆశయం.. ఆయన కల నెరవేరాలి : పరుచూరి గోపాలకృష్ణ

పవన్ కల్యాణ్.. సినిమాల్లో పవర్‌స్టార్, రాజకీయాల్లో జనసేనాని. సినిమాలను తగ్గించి నాయకుడిగా మారినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Captain: 'కెప్టెన్' ప్రీ రిలీజ్

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కెప్టెన్'. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం.

Aakrosham: 'ఆక్రోశం' సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నవరసాలను కలగలిపిన చిత్రాన్ని చూశామనే సంతృప్తి ఖచ్చితంగా పొందుతారు.. నిర్మాత సీహెచ్‌ సతీష్‌ కుమార్‌

ఆర్‌. విజయ్‌ కుమార్‌ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై అరుణ్‌ విజయ్‌, పల్లక్‌ లల్వాని, కాళీ వెంకట్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌.  మనోహర్‌, కె.ఎస్‌.జి. వెంకటేష్‌, మరుమలార్చి

సెప్టెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో 'సీతారామం'

దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరోహీయిన్లుగా నటించిన చిత్రం సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వం

Swathimutyam: 'స్వాతిముత్యం' 'డుం డుం డుం' పెళ్లి గీతం విడుదల.. అక్టోబర్ 5 న విడుదల

‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'.