Delhi Firecracker Ban : సైలెన్స్ ప్లీజ్.. ఢిల్లీలో బాణాసంచా కాల్పులపై ఈ ఏడాది కూడా నిషేధం
Send us your feedback to audioarticles@vaarta.com
భారతీయులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగల్లో దీపావళి ముందు వరుసలో వుంటుంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి అంటే వెంటనే గుర్తొచ్చేది దీపాలు, టపాసులు. పట్టుబట్టలు ధరించి చిచ్చుబుడ్లు, కాకరపువ్వోత్తులు, బొంగరాలు, మతాబులు , లక్ష్మీ బాంబులు కల్చాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. పండుగకు కొద్దిరోజుల ముందు నుంచే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మారుతున్న కాలమాన పరిస్ధితులు, ముఖ్యంగా వాతావరణం పండుగ సరదాను దూరం చేస్తున్నాయి. దేశంలోని చాలా నగరాల్లో శబ్ధ, వాయు కాలుష్యాలను దృష్టిలో వుంచుకుని అక్కడ బాణాసంచా కాల్చడాన్ని ప్రభుత్వాలు నిషేధిస్తున్నాయి. ప్రతి ఏడాది కొత్త నగరాలు ఈ లిస్టులో చేరుతున్నాయి.
తీవ్ర నిరాశలో ఢిల్లీ వాసులు :
ఈ లిస్టులో తొలి వరుసలో వుండే నగరం ఢిల్లీ. తొలి నుంచి ఇక్కడ వాయు కాలుష్యం ఎక్కువే. పీల్చే గాలి కూడా నాణ్యంగా వుండకపోవడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాలుష్యాన్ని నివారించేందుకు గత కొన్నేళ్లుగా ఇక్కడ దీపావళి నాడు బాణాసంచా కాల్పులను ప్రభుత్వం నిషేధించింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. జనవరి 1, 2023 వరకు నగరంలో బాణా సంచా కాల్పులను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. అన్ని రకాల టపాసుల ఉత్పత్త, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్చలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments