సుశాంత్ తండ్రికి నిరాశే.. పిటిషన్ కొట్టేసిన కోర్టు!

బాలీవుడ్ లో స్టార్ గా ఎదుగుతున్న టైంలో యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 14న సుశాంత్ ఉరి వేసుకుని మరణించాడు. సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు,వివాదాలు నెలకొన్న తరుణంలో ఆ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

ఇదిలా ఉండగా సుశాంత్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో అనేక చిత్రాలు తెరకెక్కుతున్నాయి. దీనితో సుశాంత్ తండ్రి కెకె సింగ్ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించారు. తమ కుమారుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఎలాంటి సినిమాలు తెరకెక్కకుండా చేయాలని, ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాల విడుదల ఆపేయాలని సింగ్ కోర్టుని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి: ఎద సౌందర్యం కోసం అసభ్యకరమైన పని చేయమన్నారు: హీరోయిన్

తమ కుమారుడి పేరు, అతడి జీవితానికి సంబంధించిన ప్రస్తావన సినిమాల్లో ఉండకూడదని పిటిషన్ లో కోరారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉండడం వల్ల ఇలాంటి చిత్రాలు కేసుని తప్పుదోవ పట్టిస్తాయని సింగ్ అన్నారు. ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న 'న్యాయ్ ది జస్టిస్' అనే చిత్రాన్ని నిలిపివేయాలని కోరారు.

ఇలాంటి చిత్రాలతో తమ కుమారుడి జీవితాన్ని తప్పుదోవ పట్టించడమే కాక, తమకు మానసిక వేదన కలిగించారు. అందుకు రూ 2 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలని అన్నారు. అయితే ఢిల్లీ హై కోర్టులో గురువారం పిటిషన్ విచారణకు వచ్చింది. వాదోపవాదాల తర్వాత కోర్టు సింగ్ పిటిషన్ ని కొట్టివేసింది.

న్యాయ్ చిత్ర విడుదల అడ్డుకోవడం కుదరదని కోర్టు తేల్చింది. న్యాయ్ తో పాటు సూసైడ్ ఆర్ మర్డర్, ఎ స్టార్ వాస్ లాస్ట్ అనే చిత్రాలు సుశాంత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నాయి.

More News

ఆమె ప్రెగ్నెన్సీతో నాకు సంబంధం లేదు.. నటి, ఎంపీపై భర్త సంచలనం!

ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు.

పవన్ మూవీలో స్టార్ డైరెక్టర్ కీలక పాత్ర ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొకటి ఇలా పవన్ వెంటవెంటనే చిత్రాలకు ఓకె చెప్పేస్తున్నాడు.

సర్ ప్రైజ్ : బాలయ్యకు యువరాజ్ సింగ్ బర్త్ డే విషెష్!

నందమూరి నటసింహం బాలకృష్ణ గురువారం తన 61వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.

ఎద సౌందర్యం కోసం అసభ్యకరమైన పని చేయమన్నారు: హీరోయిన్

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. నటీమణులుగా ఎదగాలనే కలలతో వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే సంఘటనలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తూనే ఉన్నాయి.

థర్డ్ వేవ్ దారుణంగా ఉంటుంది.. సౌత్ ఆఫ్రికా వేరియంట్ తో ప్రళయమే!

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గక ముందే వైద్య నిపుణుల్లో థర్డ్ వేవ్ పై భయాందోనళలు మొదలయ్యాయి.