'పుష్ప' టీంని చుట్టుముట్టిన డెంగ్యూ.. అల్లు అర్జున్, రష్మిక కూడా ?

  • IndiaGlitz, [Wednesday,July 28 2021]

అల్లు అర్జున్ అభిమానులని చిన్నపాటి కలవరానికి గురిచేసే వార్తే ఇది. కొన్ని రోజుల క్రితం దర్శకుడు సుకుమార్ డెంగ్యూ ఫీవర్ కు గురికావడంతో పుష్ప షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం సుకుమార్ వైద్యుల పర్యవేక్షణలో డెంగ్యూ నుంచి కోలుకుంటున్నారు. సుకుమార్ పూర్తిగా కోలుకోగానే షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది.

ఇదీ చదవండి: అనవసరంగా నన్ను లాగుతున్నారు.. పోర్న్ వీడియోస్ వివాదంపై ప్రముఖ నటి

ఇదిలా ఉండగా ఇన్సైడ్ టాక్ ప్రకారం పుష్ప చిత్ర యూనిట్, నటీనటులలో దాదాపు 20 మంది డెంగ్యూ వ్యాధికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. షూటింగ్ లొకేషన్ లో దోమలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఊహించని షాక్ ఏంటంటే లీడ్ పెయిర్ అల్లు అర్జున్, రష్మిక కూడా డెంగ్యూకి గురయ్యారట.

కానీ బన్నీ, రష్మిక లకు అంత సీరియస్ గా జ్వరం, డెంగ్యూ లక్షణాలు లేవని అంటున్నారు. త్వరగానే వారిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆరోగ్యం కుదుటపడగానే పుష్ప షూటింగ్ రీ స్టార్ట్ అవుతుంది.

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ భీకరమైన రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. పుష్ప చిత్రం రెండు భాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.

More News

అనవసరంగా నన్ను లాగుతున్నారు.. పోర్న్ వీడియోస్ వివాదంపై ప్రముఖ నటి

రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది. రాజ్ కుంద్రా ఏ ఏ యాప్స్ కోసం పోర్న్ వీడియోస్ నిర్మించారు..

'SR కల్యాణమండపం' ట్రైలర్: ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ బ్యాలన్స్ చేస్తూ..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ ఆర్ కల్యాణమండపం. ఆగష్టు 6న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.

ప్రభాస్, దీపికా పదుకొనె 'ప్రాజెక్ట్ కె' లో సమంత.. 200 రోజులా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరిందనడానికి అతడు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలే నిదర్శనం.

పవన్ కళ్యాణ్ గారి అనుభవం అపారమైనది : రానా దగ్గుబాటి

రెండు రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది.

రెండో పెళ్ళికి రెడీ అవుతున్న సుమంత్.. అమ్మాయి ఎవరంటే ?

అక్కినేని మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.