close
Choose your channels

జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌..

Thursday, January 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో.. ఫిబ్ర‌వ‌రి 14న సినిమా విడుద‌ల‌.. 

కార్తి హీరోగా న‌టిస్తున్న దేవ్ సినిమా విడుద‌ల తేదీ ఖ‌రారైంది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్. ఈ సంద‌ర్భంగా చిత్ర ఆడియో విడుద‌ల తేదీని కూడా క‌న్ఫ‌ర్మ్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. జ‌న‌వ‌రి 14న దేవ్ ఆడియో విడుద‌ల కానుంది. హ‌రీష్ జ‌య‌రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. దేవ్ ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను ర‌జ‌త్ ర‌విశంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఖాకీ లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత కార్తి స‌ర‌స‌న రెండోసారి ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిక్కీ గిర్లానీ దేవ్ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.