దేవాక‌ట్ట జాగ్ర‌త్త‌....

డైరెక్ట‌ర్ దేవాక‌ట్ట ఈసారి కాస్త జాగ్ర‌త్తప‌డ్డారు. ఆయ‌న త‌దుప‌రి చేయ‌బోయే సినిమాకు సంబ‌బంధించిన థీమ్ మోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి ‘ఇంద్రప్రస్థం’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. తాను చేయాల‌నుకుంటున్న కాన్సెప్ట్‌ల‌తో నిర్మాత విష్ణు ఇందూరి ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు డిజాస్ట‌ర్స్ చేశార‌ని, మ‌ళ్లీ ఇప్పుడు తాను చంద్ర‌బాబు, వైఎస్ఆర్ మ‌ధ్య స్నేహం, రాజ‌కీయ వైరం అంశాల‌ను తెర‌కెక్కించాల‌నుకుంటే దాన్ని కూడా విష్ణు ఇందూరి కాపీ కొట్టార‌ని, తాను ఈసారి అంత సుల‌భంగా విడిచిపెట్టన‌ని, లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటాన‌ని ఆయ‌న తెలిపారు. మ‌రో అడుగు ముందుకేసి తాను చేయాల‌నుకున్న సినిమా థీమ్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆయ‌న విడుద‌ల చేశారు.

‘సాధారణంగా పోటీ అనేది విజేతలను నిర్ణయిస్తుంది. ఒక్కొక్కసారి ఆ పోటీల్లో ఇద్దరు స్నేహితులు ఎదురైతే భలే కిక్ ఉంటుంది’ అంటూ దేవాక‌ట్ట వాయిస్ ఓవ‌ర్ త‌న సినిమా థీమ్‌ను వివ‌రించారు. ‘నైతిక‌త మారుతుందేమో కానీ.. ప‌వ‌ర్ కోసం చేసే యుద్ధం మాత్రం అలాగే ఉంటుంది’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. సంయుక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రులుగా పని చేసిన నారా చంద్ర‌బాబు నాయుడు, వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయ జీవితాల‌ను ఒకేసారి ప్రారంభించారు. మంచి స్నేహితులైన ఇద్ద‌రూ త‌ర్వాత రాజ‌కీయ వైరులుగా మారారు. వీరిద్ద‌రి రాజ‌కీయ ప్ర‌స్థానంలో మూడు ద‌శాబ్దాల‌ను ఈ చిత్రంలో చూపించ‌బోతున్న‌ట్లు దేవాక‌ట్ట తెలిపారు. ప్రూదోస్ బ్యాన‌ర్‌పై హ‌ర్ష‌.వి, తేజ.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయితేజ్ సినిమా పూర్త‌యిన త‌ర్వాత ‘ఇంద్ర‌ప్ర‌స్థం’ షూటింగ్ మొద‌ల‌వుతుందని దేవాక‌ట్ట తెలిపారు.

More News

మెగా డాటర్ నిశ్చితార్థం.. ఆ లోటు మాత్రం కనిపించింది..

మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో వైభవంగా జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్యతో

వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా: అజయ్ భూపతి

టాలీవుడ్‌ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. ఇటీవల కరోనా కారణంగా తరచూ తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వార్తల్లో నిలుస్తున్నారు.

ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. నేడు పాజిటివ్ కేసులకు సమానంగా..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.

ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ విస్తరించింది.

ఏ కులాన్ని తక్కువ చేసి చూపించట్లేదు: ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

జాతీయ అవార్డు పొందిన 'అ!' చిత్ర‌ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ‘కల్కి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని త‌న మూడో సినిమాను రూపొందిస్తున్నారు.