close
Choose your channels

అంత‌ర్జాతీయ స్టేజ్ షోలో ప‌వ‌న్ పాట‌కు డ్యాన్స్‌.. దేవిశ్రీ స్పంద‌న‌

Tuesday, May 7, 2019 • తెలుగు Comments

అంత‌ర్జాతీయ స్టేజ్ షోలో ప‌వ‌న్ పాట‌కు డ్యాన్స్‌.. దేవిశ్రీ స్పంద‌న‌

తెలుగు సినిమా రేంజ్ మ‌రోసారి ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కు రీచ్ అయ్యింది. వ‌ర‌ల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ రియాలిటీ షోలో భార‌త డ్యాన్స్ గ్రాప్ ది కింగ్స్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ షోలో ఫైన‌ల్‌కు దికింగ్స్ టీం చేసిన డ్యాన్స్ చూసి జెన్నీఫ‌ర్ లోఫెజ్‌, నీయో, డెరెక్ హూగ్ థ్రిల్ అయ్యారు.

ప‌వ‌న్ న‌టించిన 'వాడెవ‌డ‌న్నా.. వీడెవ‌డ‌న్నా..'  అనే పాట‌కు ది కింగ్స్ టీం అద్భుత‌మైన పెర్ఫామెన్స్ చేశారు. ఈ వీడియోను వ‌ర‌ల్డ్ ఆఫ్ డ్యాన్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన దేవిశ్రీ ప్ర‌సాద్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 'దికింగ్స్' గ్రూపు కాకుండా మ‌రో గ్రూపు పాపుల‌ర్ అమెరిక‌న్ షోలో త‌మ బాణీల‌ను అందించిన ఖైదీ నంబ‌ర్ 150 సినిమాలో 'సుంద‌రి..' పాట‌ల‌కు డ్యాన్స్ చేశార‌నే సంగ‌తిని గుర్తు చేసుకున్నారు. నా సంగీతం ప్ర‌జ‌ల్ని డ్యాన్స్ చేయించ‌డం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ధ‌న్య‌వాదాలు. ల‌వ్ యు గ‌య్స్‌.. మీరు ఎంతో చ‌క్క‌గా డ్యాన్స్ చేశారు. కీప్ రా'కింగ్స్‌' అంటూ ట్వీట్ చేశారు. 

Get Breaking News Alerts From IndiaGlitz