'దేవిశ్రీప్రసాద్' ప్రీ రిలీజ్ వేడుక

  • IndiaGlitz, [Friday,November 03 2017]

ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై యశ్వంత్ మూవీస్ ప్రెసెంట్స్ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. కళ్యాణ్ కృష్ణ, శ్రీనివాసవరెడ్డి, అమ్మ రాజశేఖర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంధర్బంగా ..

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ "టైటిల్ చూస్తుంటే కొత్త కాన్సెప్ట్ ను ఎక్సపెక్ట్ చేయొచ్చు. డైరెక్టర్ శ్రీ కృష్ణ నాకు బాగా తెలుసు. తను చేసే ప్రతి సినిమా కొత్తగా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఈ చిత్రం కూడా అలానే ఉంటుందని భావిస్తున్నాను" అన్నారు.

నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ "ఈ చిత్రంలో నటించిన ముగ్గురూ నాకు ఫ్రెండ్స్ కావడంతోనే ఈ ఫంక్షన్ కు హాజరయ్యాను. బ్యానర్ కు, నటీనటులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ చిత్ర కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అందరికీ నచ్చుతుందని బావిస్తున్నాను" అన్నారు.

నిర్మాత డి వెంకటేష్ మాట్లాడుతూ "కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నా.. ఎంత కష్టం ఎదురయినా సినిమాను 10తేదీన విడుదల చేస్తున్నాము. యూ ఎస్ ఎ లో 45 థియేటర్లలో దేవిశ్రీప్రసాద్ ను విడుదలచేస్తున్నాం" అని అన్నారు.

నాగ అన్వేష్ మాట్లాడుతూ "ఈ సినిమా ద్వారా నెగటివిటీ చూపించడం లేదు. ప్రతి అమ్మాయి చూసేలా ఉంటుంది ఈ చిత్రం. డిఫరెంట్ సబ్జెక్టును ఆదరిస్తారని కోరుతున్నాం" అని తెలిపారు.

భూపాల్, ధనరాజ్, పూజా రామచంద్రన్, నిర్మాత ఆక్రోష్, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని తెలిపారు.
పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్ రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి, వేణు టిల్లు త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః కమ్రాన్‌, కెమెరాః ఫ‌ణీంద్ర వ‌ర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్ర‌మౌళి.ఎం, మాట‌లుః శేఖ‌ర్ విఖ్యాత్‌, శ్రీ కిషోర్‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః చంద్ర వ‌ట్టికూటి, నిర్మాత‌లుః డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీ కిషోర్‌.

More News

నవంబర్ 9 న అదిరింది రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం ట్రైలర్లకు కు అద్భుతమైన స్పందన లభించింది.

ప్రొడక్షన్ నెంబర్ 1 షూటింగ్ ప్రారంభం !!

రాకేందుమౌళి-కల్పిక జంటగా.. యువ ప్రతిభాశాలి హరీష్ కె.విని దర్శకుడిగా పరిచయం చేస్తూ..  మేజిన్ మూవీ మేకర్స్ పతాకంపై యువ నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్  ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్న చిత్రం నవంబర్ 2న ప్రారంభమైంది.

'రాజా ది గ్రేట్' చిత్రానికి మరింత వినోదం జ‌త కానుంది...

అరె బుజ్జి..ప్రేక్ష‌కుల ముఖ చిత్రాలేంటి? ఆనందం..అమితానందంతో ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు..

సిద్దార్థ్ సినిమా వాయిదా ప‌డింది

శంక‌ర్ రూపొందించిన బాయ్స్ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు సిద్దార్థ్‌. నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, బొమ్మ‌రిల్లు చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన సిద్ధార్థ్‌.. ఆ త‌రువాత ఆ స్థాయి విజ‌యాల‌ను అందుకోలేక‌పోయాడు.

వాన విల్లు ట్రైలర్ లాంచ్

రాహుల్ ప్రేమ్( ఆర్ పి) మూవీ మేకర్స్ బ్యానర్ పై లంక  ప్రతీక్ ప్రేమ్ కరణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రం వానవిల్లు. ఈ చిత్రానికి నిర్మాత లంక కరుణాకర్ దాస్ కాగా శ్రావ్య రావు, విశాఖ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.