దేవిశ్రీకి తప్పలేదు

  • IndiaGlitz, [Monday,April 11 2016]

అదేంటో.. కొన్ని సెంటిమెంట్లు వ‌ద్ద‌న్నా వెంటాడుతూనే ఉంటాయి. దేవిశ్రీ ప్ర‌సాద్‌కి అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. తెలుగులో చేసిన సీక్వెల్స్ ఏవీ అచ్చిరావ‌న్న‌ది. ముఖ్యంగా మెగాహీరోల‌తో చేసిన‌వి. ఇది 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్' విష‌యంలో మ‌రోసారి రుజువైంది. ఇదివ‌ర‌కు చిరంజీవితో 'శంక‌ర‌దాదా ఎం.బి.బి.ఎస్' అనే హిట్ చిత్రానికి సీక్వెల్‌గా చేసిన 'శంక‌ర్ దాదా జిందాబాద్' డిజ‌ప్పాయింట్ చేస్తే.. అదే వ‌రుస‌లో అల్లు అర్జున్‌తో 'ఆర్య' అనే హిట్ ఫిల్మ్ కి సీక్వెల్‌గా చేసిన 'ఆర్య 2' నిరాశ‌ప‌రిచింది.

ఇదే వ‌రుస‌లో ప‌వ‌న్‌తో 'గ‌బ్బ‌ర్ సింగ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత చేసిన 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' అనే సీక్వెల్ కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తోందిప్పుడు. దీంతో దేవిశ్రీ తెలుగులో సీక్వెల్ చిత్రాల‌కు సంగీత‌మందిస్తే అవి ఆడ‌వు అనే ముద్ర బ‌లంగా ప‌డిపోయిన‌ట్ల‌య్యింది. అయితే.. త‌మిళంలో మాత్రం ఈ ప‌రిస్థితి భిన్నంగా ఉంది. సూర్య‌తో 'సింగం' (య‌ముడు)కి సీక్వెల్ గా 'సింగం 2' చేస్తే అది బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ చిత్రంగా నిలిచింది.

More News

ఆర్ధిక ఇబ్బందుల్లో పవన్...రాజకీయాల గురించి...

ఏమిటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉనాడా?అవునండీ..

సమంతను వెళ్లకుండా ఆపేసిన మహేష్....

ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న సమంత,హీరో సూర్యతో కలిసి నటించిన చిత్రం 24.

అల్లరోడి నెక్ట్స్ సినిమా వివరాలు...

అల్లరి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటరైన హీరో నరేష్ ఆ సినిమా సక్సెస్ సాధించడంతో దాన్ని తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు.

కాజల్ ఉంటే అంతే

ఈ తరం అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్.. ఇలా అందరితోనూ జోడీ కట్టిందీ చందమామ.

ఎన్టీఆర్ తో నటశేఖరుడు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం జనతాగ్యారేజ్.