close
Choose your channels

'మ‌జిలీ' రీమేక్‌లో ధ‌నుష్‌

Thursday, April 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`మ‌జిలీ` రీమేక్‌లో ధ‌నుష్‌

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకున్న త‌ర్వాత క‌లిసి జంట‌గా న‌టించిన చిత్రం ` మ‌జిలీ`. ఏప్రిల్ 5న విడుద‌లైన ఈ చిత్రం 50 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు `మ‌జిలీ` సినిమాను రీమేక్ చేయాల‌ని ఇత‌ర భాషల‌కు చెందిన హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ముఖ్యంగా త‌మిళ సినీ పరిశ్ర‌మ‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను త‌మిళంలో ధ‌నుష్‌తో రీమేక్ చేయాల‌ని స‌ద‌రు నిర్మాత భావిస్తున్నాడని టాక్‌. నిజానికి త‌మిళంలో ధ‌నుష్ బాడీ లాంగ్వేజ్‌, పెర్ఫామెన్స్‌కు ఈ సినిమా ప‌క్కాగా యాప్ట్ అవుతుందని అంటున్నారు. త్వ‌ర‌లోనే `మ‌జిలీ` త‌మిళ రీమేక్‌పై ఏదో ఒక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.