close
Choose your channels

హీరో ధ‌నుష్ త‌ల న‌ర‌కుతా అంటూ బెదిరింపులు

Friday, February 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో ధ‌నుష్ త‌ల న‌ర‌కుతా అంటూ బెదిరింపులు

`అసుర‌న్` సినిమాతో గ‌త ఏడాది స‌క్సెస్ అందుకున్న హీరో ధ‌నుష్ ఇప్పుడు `క‌ర్ణ‌న్` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను క‌లైపులి థాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ సామాజిక వ‌ర్గాన్ని త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఈ చిత్రానికి వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడులో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. 1990లో జ‌రిగిన కుల ఘ‌ర్ష‌ణ‌లు ఆధారంగా సినిమా ఉండ‌నుంద‌ని, అందులో త‌మ‌ను త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పులిప్ప‌డై సామాజిక వ‌ర్గం ఆరోపిస్తున్నారు. త‌మ సామాజిక వ‌ర్గాన్ని త‌ప్పుగా చూపిస్తే ధ‌నుష్ త‌ల న‌రుకుతానంటూ ఓ యువ‌కుడు ఓ వీడియో పోస్ట్ చేయ‌డం దుమారం రేపుతుంది. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇక్క‌డ పేర్కొనాల్సిన విష‌య‌మేమంటే.. ధ‌నుష్ గ‌త ఏడాది హిట్ సాధించిన `అసుర‌న్‌` సినిమా కూడా సామాజిక వ‌ర్గం, భూవివాదాల నేప‌థ్యాల‌లో సాగేదే. ఇప్పుడు మ‌రోసారి కూడా ధ‌నుష్ అలాంటి పాయింట్‌నే న‌మ్ముకున్నాడు. అయితే ఈసారి మాత్రం అత‌ని సినిమా వివాదాల్లో చిక్కుకుంది. కానీ ఈ విష‌యం అటు ధ‌నుష్‌, ఇటు నిర్మాత ఎలాంటి ప్ర‌క‌టనా ఇవ్వలేదు. అయితే సామాజిక వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌ల నేప‌థ్యంలో సినిమాలు తెర‌కెక్క‌డం ఇదేమీ కొత్త కాదు. అదే త‌ర‌హాలో కొత్త సినిమా రానుంది. మ‌రి ఈ వివాదం ఏ మ‌లుపులు తీసుకుంటుందో వేచి చూద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.