close
Choose your channels

ధ‌నుష్ 'మారి2' చిత్ర ఆంధ్రా, సీడెడ్ రైట్స్ సొంతం చేసుకున్నఐకాన్ మూవీస్‌

Tuesday, December 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ధ‌నుష్ మారి2 చిత్ర ఆంధ్రా, సీడెడ్ రైట్స్ సొంతం చేసుకున్నఐకాన్ మూవీస్‌

ధ‌నుష్ హీరోగా, సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించిన లెటెస్ట్‌ చిత్రం మారి2.. ఈ చిత్రం మారి కి సీక్వెల్ గా వ‌స్తుంది. ఇప్ప‌టికే మారి కి వున్న క్రేజ్ ఈ సీక్వెల్ మారి2 కి మార్కెట్ లో క్రేజ్ ని తీసుకువ‌చ్చింది. మారి2 టీజ‌ర్స్‌, పోస్ట‌ర్స్ కి , విడ‌దులయ్యిన సాంగ్స్ కి సూప‌ర్‌ రెస్పాన్స్ రావ‌టంతో ఫ్యాన్సిరేట్ల‌కే బ‌య్య‌ర్స్ కొనుగొలు చేయ‌టం విశేషం. ఈ చిత్రాన్ని ఆంధ్రా, సీడెడ్ హ‌క్కుల‌ని ప్ర‌ముఖ నిర్మాత‌ ఐకాన్ మూవీస్ అదినేత శ్రీరామ్ గారు విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని డి.ప్ర‌తాప్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో, ధ‌నుష్ నిర్మాత‌గా బాలీజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న గ్రాండ్ గా విడుద‌ల అవుతుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మారి2 లో ఓ సాంగ్ ని ప్ర‌ముఖ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు లెజెండ్ ఇల‌య‌రాజా పాడ‌గా, హీరో ధ‌నుష్ లిరిక్స్ అందించారు. అలాగే ఓ సాంగ్ ని ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ ప్రభుదేవా కొరియోగ్రఫి చేయ‌టం విశేషం. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌, హీరో ధ‌నుష్ మాట్లాడుతూ.. మారి చిత్రం చాలా పెద్ద స‌క్సస్ ని సాధించింది. ఇప్ప‌డు దానికి సీక్వెల్ గా మారి2ని విడుద‌ల చేస్తున్నాము. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంభందించిన టీజ‌ర్స్ , పోస్ట‌ర్స్, సాంగ్స్‌ త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌ర్ని అక‌ట్టుకుంటుంది. ఇళ‌య‌రాజా గారు ఓక సాంగ్ ని పాడ‌టం చాలా ఆనందంగా వుంది. అలాగే ప్రభుదేవా కొరిగ్ర‌ఫి అందించ‌టం కూడా చాలా ఆనందంగా వుంది.. అని అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.