ధనుష్ సినిమా రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Wednesday,March 22 2017]

ధ‌నుష్ హీరోగా సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి థాను వి.ఐ.పి2 చిత్రాన్ని నిర్మించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి, అప్పుడెప్పుడో మెరుపు క‌ల‌లు సినిమాతో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన కాజోల్ ఆ తర్వాత హిందీ సినిమాల‌తో బిజీగా మారింది.

త‌ర్వాత మ‌రే ద‌క్షిణాది సినిమాలోనూ యాక్ట్ చేయ‌లేదు. దాదాపు రెండు ద‌శాబ్దాలు త‌ర్వాత కాజ‌ల్ మ‌రోసారి ద‌క్షిణాది సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈ సినిమాను జూలై 14న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. ధ‌నుష్ న‌టించిన విఐపి సినిమా త‌మిళంతో పాటు తెలుగులో కూడా సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. వి.ఐ.పి సినిమాను తెలుగులో ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ పేరుతో విడుద‌ల చేశారు. మ‌రి వి.ఐ.పి 2 చిత్రాన్ని అనువాదం చేసి తెలుగు, త‌మిళంలో ఓకేరోజు విడుద‌ల చేసే అవ‌కావాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి.