'వీఐపీ2' వాయిదా పడింది..!

  • IndiaGlitz, [Thursday,July 20 2017]

ధనుష్ హీరోగా న‌టించిన 'వీఐపీ2' విడుద‌ల వాయిదా ప‌డింది. అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన సినిమా ఇది. సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ధ‌నుష్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఈ నెల 28న 'వీఐపీ2'ను విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా విడుద‌ల‌ను ఆగ‌స్ట్ మొద‌టివారానికి వాయిదా వేశారు.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. వండ‌ర్‌బా ఫిల్మ్స్, వీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా వాయిదా విష‌యాన్ని సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ధ్రువీక‌రించారు. ధ‌నుష్ అభిమానులు సంయ‌మ‌నంతో అర్థం చేసుకుంటార‌ని ఆమె అందులో పేర్కొన్నారు. వేలై ఇల్లాద ప‌ట్ట‌దారి సినిమా తెలుగులోనూ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. కాజోల్ ఇందులో కీల‌క పాత్ర పోషించిన విష‌యం కూడా తెలిసిందే. రీతు వ‌ర్మ‌, స‌ముద్ర‌ఖ‌ని, శ‌ర‌ణ్య పొన్ వ‌ణ్ణ‌న్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

More News

'యువర్స్ లవింగ్లీ' మోషన్ పోస్టర్ రిలీజ్

యువ ప్రతిభాశాలి 'జో' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృద్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సందేశమిళిత వినోదాతాత్మక చిత్రం "యువర్స్ లవింగ్లీ".

వేశ్య పాత్రలో రజనీకాంత్ హీరోయిన్

సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `కాలా`. ఈ చిత్రంలో ముంబై హీరోయిన్ హ్యుమా ఖురేషి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

'వివేకం' తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. టి.జి.త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీడియా జీవితాల్ని నాశనం చేసింది - పూరి జగన్నాథ్

డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు పూరి జగన్నాథ్. 11 గంటల పాటు విచారణ సాగింది. విచారణ అనంతరం పూరి జగన్నాథ్, ఎవరితో మాట్లాడకుండా ఇల్లు చేరుకున్నాడు.

'శమంతకమణి' సక్సెస్ తో భవ్య క్రియేషన్స్ తో ఓ మెట్టు ఎదిగింది - నిర్మాత వి.ఆనంద ప్రసాద్

నారారోహిత్, సందీప్కిషన్, సుధీర్బాబు, ఆది హీరోలుగా భవ్య క్రియేషన్స్ బ్యానర్పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం 'శమంతకమణి'.