ధ‌న్య మ‌ల‌యాళం ఎంట్రీ

  • IndiaGlitz, [Tuesday,August 21 2018]

ధ‌న్య బాల‌కృష్ణ‌న్ పేరు విన‌గానే మ‌న‌కు సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, ర‌న్ రాజా ర‌న్‌, నేనూ శైల‌జ వంటి ప‌లు సినిమాలు గుర్తుకొస్తాయి. 'త‌ను చ్చెనంట‌', 'జ‌య‌జాన‌కీ నాయ‌కా' తెలుగులో ఆమె ఇటీవ‌ల న‌టించిన చిత్రాలు. ధ‌న్య ఇప్పుడు మ‌ల‌యాళం నేర్చుకుంటున్నారు. మ‌ల‌యాళ సినిమాల్లో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో నివిన్ పాల్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది.

ఈ సినిమాలో న‌య‌న‌తార నాయిక‌. తాజాగా ఆమె న‌య‌న‌తార ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఫుల్ లెంగ్త్ రోల్ అని తెలిసింది. ఆల్రెడీ హీరోయిన్ ఫ్రెండ్‌గానో, హీరో ఫ్రెండ్‌గానో న‌టించ‌డం ధ‌న్య‌కు అల‌వాటే. తాజాగా మ‌ల‌యాళంలోనూ ఫ్రెండ్ పాత్ర‌లో న‌టిస్తోంది. నివిన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించ‌డం న‌య‌న‌తార‌కు ఇదే తొలిసారి.

ల‌వ్ యాక్ష‌న్ డ్రామా కోవ‌లోకి చెందిన సినిమా ఇది. ధ్యాన్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే ప్రారంభం కావాల్సిన ప్రాజెక్ట్ డేట్ల క్లాష్ వ‌ల్ల ప్రారంభం కాలేదు. దానివ‌ల్ల ఈ మే నుంచి మొద‌లుపెట్టారు. ఇప్పుడు కేర‌ళ‌లో వ‌ర‌ద‌ల కార‌ణంగా కాస్త ఆగింది.

More News

చైతు సినిమా పోస్ట్ పోన్ అవుతుందా?

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా రూపొందుతోన్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టిస్తుండ‌గా...

50 కోట్ల క్ల‌బ్‌లో 'గీత గోవిందం'

ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన 'గీత గోవిందం' బాక్సాఫీస్ సంచ‌నాల‌కు కేంద్ర‌మైంది. అర్జున్‌రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం కావ‌డంతో.. తొలి రోజున యూత్ థియేట‌ర్స్‌కు వ‌చ్చారు.

ర‌జనీకాంత్‌తో డ‌స్కీ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సిన‌మా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ మాయ పేరేమిటో చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది - కోన వెంక‌ట్‌

వి.ఎస్‌.వ‌ వర్క్స్  బేనర్‌పై  సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'.

ఐందవి ఆడియో విడుదల..

సన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నందు, అనురాధా జంటగా నటిస్తున్న చిత్రం ఐందవి. హార్రర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు.