ధృవ ట్రైలర్ తో రికార్డ్ క్రియేట్ చేసిన చరణ్..!

  • IndiaGlitz, [Saturday,November 26 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్లో రూపొందుతున్న స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ‌. త‌ని ఓరువ‌న్ రీమేక్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం పై ఫ‌స్ట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాల‌కు త‌గ్గ‌ట్టు ఆడియో ఆక‌ట్టుకోవ‌డంతో ఫ్యాన్స్ ట్రైల‌ర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆస‌క్తిగా ఎదురుచూసారు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ ధృవ ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.
ఈ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసిన కొన్ని గంట‌ల్లోనే మిలియ‌న్ మార్క్ ను క్రాస్ చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు రామ్ చ‌ర‌ణ్‌. ఐపిఎస్ ఆఫీస‌ర్ ధృవ గా చ‌ర‌ణ్ లుక్స్, పి.ఎస్.వినోద్ కెమెరా వ‌ర్క్, సురేంద‌ర్ రెడ్డి టేకింగ్ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ట్రైల‌ర్ కొన్ని గంట‌ల్లోనే మిలియ‌న్ మార్క్ ను క్రాస్ చేయ‌డం చూస్తుంటే ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది. ఇక ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

నాగ్ రాజు గారి గది 2 ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

నవరస సమ్రాట్ నాగార్జున ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో

ధృవ ట్రైలర్ అదిరింది..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా

ధనుష్ కి కొత్త సమస్య....

తమిళ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హీరో,నిర్మాతగా ఉన్న ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు కూడా.

'బిచ్చగాడు' మరో రికార్డ్....

చిన్న చిత్రంగా తమిళంలో విడుదలైన 'పిచ్చైకారన్' అక్కడ మంచి విజయాన్ని సాధించింది.

అది చూసిన తర్వాత కిక్ ఇచ్చింది అందుకే యుఎస్ ఎలో ధృవ ప్రీమియర్ - అల్లు అరవింద్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధృవ.