సంక్రాంతికి పక్కా అంటున్న 'డిక్టేటర్'

  • IndiaGlitz, [Tuesday,November 10 2015]

నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న చిత్రం డిక్టేటర్'. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్ దర్శకుడు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ..

కో ప్రొడ్యూసర్, దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ 'సినిమాను సంక్రాంతికి ఎట్టి పరిస్తితుల్లోనూ విడుదల చేయాలని మా సంకల్పానికి బాలయ్యగారు పూర్తి సహాయ సహాకారాలందిచారు. ప్రతి క్షణం ఆయన అందించిన మద్దతుతొ సినిమా షూటింగ్ చాలా కూల్ గా ఎటువంటి ఆటంకం లేకుండా శరవేగంగా జరుగుతుంది. అలాగే సినిమాలో మిగిలిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందించిన సపోర్ట్ తో సినిమాను అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇప్పటికి సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రెండు పాటలు, రెండు ఫైట్స్, డిల్లీలో చిత్రీకరించాల్సిన కొన్ని సీన్స్ మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. డిసెంబ‌ర్ లో ఆడియో విడుదల చేసి సినిమాను సంక్రాంతికి సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

More News

నిత్యాకి ఇది మళ్లీ మళ్లీ రాని సంవత్సరమే

సౌత్ లోని అన్ని భాషల్లోనూ నటిగా తన సత్తాని చాటుకుంది కేరళ కుట్టి నిత్యా మీనన్.అయితే..ఈ సంవత్సరం మాదిరిగా మరే సంవత్సరం నిత్యాకి విజయాలను,గుర్తింపుని తీసుకురాలేదనే చెప్పాలి.

అప్పుడు బాలకృష్ణ...ఇప్పుడు కళ్యాణ్ రామ్

నందమూరి బాలకృష్ణతో పదేళ్ల క్రితం ఓ భారీ సినిమా తీసి హిట్ కొట్టలేకపోయిన ఓ దర్శకుడు..మళ్లీ పదేళ్ల తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

సునీల్ సంద‌డే సంద‌డి

సునీల్ గ‌త చిత్రం 'భీమ‌వ‌రం బుల్లోడు' రిలీజై అటుఇటుగా రెండేళ్లు అవుతోంది. అత‌ని కొత్త చిత్రం 'కృష్ణాష్ణ‌మి' ఈపాటికే రావాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల డీలే అవుతోంది.

సీక్వెల్ కు సిద్ధమవుతున్న విశాల్...

తమిళ స్టార్ విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో విశాల్ సినిమాలు తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదలవుతున్నాయి.

శ్రుతి హాస‌న్ ఫుల్ హ్యాపీ

గ‌త దీపావ‌ళికి వ‌చ్చిన 'పూజై' (తెలుగులో 'పూజ‌')తో త‌మిళంలో తొలిసారిగా విజ‌యాన్ని అందుకుంది శ్రుతి హాస‌న్‌.