అందుకోసం చిరు చైనా వెళ్ళారా?

  • IndiaGlitz, [Monday,February 05 2018]

ఆధునిక సాంకేతిక‌ పరిజ్ఞాన విప్లవం అన్ని రంగాల్లోనూ విస్తరిస్తోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. విజయాల్ని సాధిస్తున్నారు. వీటికి ఉదాహరణగా రోబో', బాహుబలి' సిరీస్ వంటి సినిమాలను చెప్పుకోవచ్చు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి' చిత్రానికి కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోబోతున్నారు దర్శక, నిర్మాతలు.

ఈ సినిమాకి సంబంధించి.. చిరు గెట‌ప్‌కు కావాల్సిన‌ ముఖ కవళికలను కంప్యూటర్‌లో బంధించేందుకు.. ఇలా క్లీన్ షేవ్ అవ‌స‌రం పడింద‌ట‌. ఇందులో భాగంగానే నిన్న‌మొన్న‌టివ‌ర‌కు గుబురు గెడ్డంలో ఉన్న చిరు...ఉన్నట్టుండి మీసం, గెడ్డం తీసేశారు. అంతేగాకుండా, ఈ విషయమై చిరంజీవి చైనా వెళ్ళి వ‌చ్చార‌ట కూడా. అక్కడ ఒక సంస్థ జ‌రిపిన‌ సెషన్‌లో కొన్ని గంటల పాటు, కొన్ని వందల కెమెరాల మధ్య చిరంజీవి హావభావాలను ఇస్తుండగా...వాటిని కంప్యూటర్లలో బంధించారు. సినిమాను గ్రీన్ మ్యాట్‌పై చిత్రీకరించిన తర్వాత కంప్యూటర్లలో అప్‌లోడ్ చేశాక...విజువల్ ఎఫెక్ట్స్ లో ముఖంలోని హావభావాలు అనుకున్న విధంగా తీసుకురావడం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే చిరంజీవి క్లీన్ షేవ్‌తో చైనా వెళ్లి వచ్చారు.దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా వెళ్ళాల్సి వుండగా...కొన్ని కారణాల వలన ఆఖరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని సమాచారం. కాగా, ఈ నెల‌లోనే ఈ సినిమాకి సంబంధించిన‌ రెండో షెడ్యూల్‌ని ప్రారంభించ‌నున్నారు.

More News

మణిరత్నం సినిమాని వదులుకున్న నటుడు

మణిరత్నం..భారతీయ సినీ ప్రేక్షకులకి పరిచయం చేయనక్కర్లేని లెజండరీ దర్శకుడి పేరిది.

నాగ్ , నాని చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

కింగ్ నాగార్జున,నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ బయోపిక్ కు హాలీవుడ్ బృందం

మహానటుడు,విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా 'యన్.టి.ఆర్.' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా కాజల్?

బెల్లంకొండ సురేష్ తనయుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

మూడో వారం నుంచి వెంకీ, తేజ చిత్రం?

చాలా కాలంగా విజయం కోసం ఎదురుచూసిన సంచలన దర్శకుడు తేజ..