టైటిల్ విషయంలో క్రిష్ క్లారిటీకి వచ్చేశాడా?

  • IndiaGlitz, [Thursday,December 03 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేసిన జాగ‌ర్ల‌మూడి క్రిష్‌కు క‌రోనా వైర‌స్ పెద్ద షాకే ఇచ్చింది. షూటింగ్ ఆపేశాడు. ‘వ‌కీల్‌సాబ్’ పూర్తి చేసిన త‌ర్వాత కానీ.. ప‌వ‌న్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఉండ‌దు. అయితే ఈ గ్యాప్‌ను క్రిష్ మ‌రో సినిమాతో పూర్తి చేసుకోవాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో ఓ సినిమా ప్లాన్ చేసి పూర్తి చేసేశాడు. పక్కా ప్లానింగ్ ఉండ‌టం వ‌ల్ల క్రిష్ త‌న సినిమాను అనుకున్న టైమ్‌లో పూర్తి చేసేశాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

తాజాగా సినీ వ‌ర్గాల్లో వార్తొక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.. అదేంటంటే ‘కొండ‌పొలం‘ అనే న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకునే సినిమాను తెర‌కెక్కించార‌ని... అందుక‌నే అదే టైటిల్‌నే సినిమాకు కూడా పెట్టాల‌ని క్రిష్ నిర్ణ‌యించుకున్నాడ‌ని. ప‌రిమిత బ‌డ్జెట్‌లో చేసిన ఈ సినిమా విడుద‌ల థియేట‌ర్స్‌లో ఉంటుందా లేక డిజిట‌ల్‌లో ఉంటుందా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. గిరిజ‌నులు కొండ మీద చేసే వ్య‌వ‌సాయం, ఆ వ్య‌వ‌సాయం చేసే స‌మ‌యంలో జంతువులు, వాతావ‌ర‌ణంతో క‌లిగే ఇబ్బందులు ఆధారంగా రాసిన ‘కొండ‌పొలం’ పుస్త‌కం ఆధారంగా చేసిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి.

More News

ర‌వితేజ‌కు విల‌న్‌గా మారిన హీరో

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. రీసెంట్‌గానే ‘క్రాక్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ర‌వితేజ‌..

కోవిడ్ ఎఫెక్ట్‌... ‘పుష్ప’ షూటింగ్ క్యాన్సిల్‌

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

రేస్ టు ఫినాలే.. ఫైనల్ రౌండ్‌లో సొహైల్, అఖిల్..

‘ఖేలో ఖేలో ఖేలోరే.. ’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. సొహైల్‌ని కూర్చోబెట్టి అవినాష్.. మోనాల్ తన్నడం గురించి చెప్పి బాధ పడ్డాడు.

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న స్టార్ క‌మెడియన్‌సునీల్‌.. ?

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి524’

కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు.