'డై హార్డ్ ఫ్యాన్స మోష‌న్ పోస్ట‌ర్ కి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్య స్పంద‌న‌

  • IndiaGlitz, [Sunday,July 24 2022]

ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ ముఖ్య‌పాత్రల్లో శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం డై హార్డ్ ఫ్యాన్. ఈ చిత్రం లో ప్రియాంక శర్మ హీరోయిన్ పాత్ర‌లో నటిస్తున్నారు. హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ.

ఇందులో షకలక శంకర్ బేబమ్మ.. రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ పాత్రలో చాలా బాగా న‌టించి మొప్పిచారు. ష‌క‌ల‌క శంక‌ర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది. సినిమా లో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరొయిన్ ని క‌ల‌వాల‌నుకుంటాడు. అనుకొకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. ఈ చిత్రం లో అన్ని పాత్ర‌లు కూడా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి. ద‌ర్శ‌కుడు అభిరామ్ M ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని చిత్రీక‌రించ‌డు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మిచారు. క‌థ లో మ‌లుపులు ప్రేక్ష‌కుడ్ని థ్రిల్ చేస్తాయి.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి సంభందిచిన కాన్సెప్ట్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అన్యూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు

More News

68th national film awards: జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘‘సూరారైపోట్రు’’ హవా.. ఏకంగా ఐదు అవార్డులు

జాతీయ అవార్డ్స్(National Awards) వేదికపై తమిళ చిత్రం సూరారై పోట్రు(Soorarai Pottru) సత్తా చాటింది.

68th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..!!

2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

68th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘‘కలర్ ఫోటో’’... బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘థమన్’

2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Lal Singh Chadda: 'లాల్ సింగ్ చెడ్డా' నుంచి నాగ చైతన్య లుక్ విడుదల

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా.

Janasena : జగన్‌వి గొప్పలే.. 10 శాతం కూడా భూసేకరణ కాలేదు : రామాయపట్నం పోర్ట్ నిర్మాణంపై నాదెండ్ల వ్యాఖ్యలు

రామాయపట్నం పోర్టు నిర్మాణంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.