రెజీనా..ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

'కొత్త జంట‌', 'ప‌వ‌ర్‌', 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్' సినిమాల‌తో హిట్ చిత్రాల క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది చెన్నై సోయ‌గం రెజీనా. ప్ర‌స్తుతం చేతిలో నాలుగైదు చిత్రాల‌తో బిజీగా ఉన్న రెజీనా .. ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్ ఫేస్ చేస్తోంది. అదేమిటంటే.. 'య‌జ్ఞం' వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ త‌రువాత క‌థానాయ‌కుడు గోపీచంద్‌, ద‌ర్శ‌కుడు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న 'సౌఖ్యం' (ప‌రిశీల‌న‌లో ఉన్న టైటిల్‌) కోసం హీరోయిన్‌గా న‌టిస్తున్న రెజీనా.

'శ్రీ' వంటి యావ‌రేజ్ మూవీ త‌రువాత హీరో మంచు మ‌నోజ్‌, ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న 'శౌర్య' (ప‌రిశీల‌న‌లో ఉన్న టైటిల్‌) లోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అంటే.. రెజీనాని ప్ర‌స్తుతం బిజీగా మార్చేసిన‌ రెండు చిత్రాలు కూడా హీరో, డైరెక్ట‌ర్‌ల కాంబినేష‌న్‌ల ప‌రంగా రెండో చిత్రాలన్న‌మాట‌. మ‌రి ఈ రెండు సినిమాలు తొలి సినిమాల‌కి మించి పాజిటివ్ రిజ‌ల్ట్స్‌ని న‌మోదుచేసుకుంటాయో లేదో చూడాలి.

More News

నా స్టామినాకి, నా స్పీడుకి ఫ్యూయ‌ల్ నా అభిమానులే : చిరంజీవి

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని డి.వి.వి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై దాన‌య్య నిర్మించారు.

బ్రూస్ లీ లో చిరు డైలాగ్స్

మెగాస్టార్ చిరంజీవి కొంత గ్యాప్ త‌ర్వాత బ్రూస్ లీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే బ్రూస్ లీ చిత్రంలో మెగాస్టార్ న‌టిస్తున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి చిరు పాత్ర పై అంచ‌నాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

జాకీచాన్ తో క‌ల‌సి న‌టిస్తున్న హీరోయిన్..?

యాక్షన్ మూవీస్ తో ఆక‌ట్టుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ జాకీచాన్.

చిరు ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు..?

మెగాస్టార్ చిరంజీవి బ్రూస్ లీ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సునీల్ క్రిష్ణాష్ట‌మి రిలీజ్ ఎప్పుడు..?

అందాల రాముడు, పూల రంగ‌డు,మిస్ట‌ర్ పెళ్లికొడుకు, భీమ‌వ‌రం బుల్లోడు...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌తో అల‌రించిన క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్. కొంత గ్యాప్ త‌రువాత సునీల్ హీరోగా న‌టించిన చిత్రం క్రిష్ణాష్ట‌మి.