'డీజే' పైరసీపై సైబర్ పోలీసులకు పిర్యాదు చేసిన దిల్ రాజు

  • IndiaGlitz, [Wednesday,June 28 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌'. ఈ సినిమా విడుద‌లైన బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొడుతూ విజ‌య ప‌థంలోకి దూసుకెళుతుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ 25వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఒక వారంలో వంద కోట్ల వ‌సూళ్లను సాధించ‌నుండ‌టం విశేషం.
ఇలాంటి త‌రుణంలో పైర‌సీదారుల చ‌ర్య‌లు సినిమాకు పెద్ద ఆటంకంగా మారింది. కొంద‌రు దుండ‌గులు అప్పుడే సినిమాను సోష‌ల్ మీడియాలో లీక్ చేసేశారు. ఇటువంటి దుశ్చ‌ర్య‌లు క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని భావించిన నిర్మాత దిల్‌రాజు, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సైబ‌ర్ క‌మీష‌న‌ర్‌కు పైర‌సీని అడ్డుకోవాల‌ని పిర్యాదు చేశారు. పిర్యాదుపై స్పందించిన క‌మీష‌న‌ర్ వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హ‌మీ ఇచ్చారు.

More News

విశాల్ మూవీ మెయిన్ పాయింట అదేనంట...

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ, నటిస్తున్న విశాల్ ఇప్పుడు మిస్కిన్ దర్శకత్వంలో `తుప్పరివాలన్` అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు మిత్రన్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో `ఇరుంబు తిరై` అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.

మరోసారి సమన్లు

సూపర్స్టార్ మహేష్ హీరోగా కొరటాల దర్శకత్వంలో వచ్చిన సినిమా `శ్రీమంతుడు`. సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. మనకు ఎంతో చేసిన మన పుట్టిన ఊరుకి మనం తిరి ఏదో చేయాలనే కాన్సెప్ట్తో శ్రీమంతుడు తెరకెక్కింది.

సెప్టెంబర్ 1న జవాన్ విడుదల

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

'జై లవకుశ' సీన్స్ లీక్డ్...అరెస్ట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జై లవకుశ'.

బన్ని సినిమాలో విలన్ గా...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో