3 పండ‌గ‌ల‌కు 3 సినిమాలు రెడీ చేస్తున్న దిల్ రాజు

  • IndiaGlitz, [Wednesday,August 10 2016]

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స్పీడు పెంచి వ‌రుస‌గా సినిమాలు రెడీ చేస్తున్నారు. 3 పండ‌గ‌లకు 3 సినిమాల‌ను రిలీజ్ చేసేలా ప‌క్కా ప్లాన్ రెడీ చేసారు. ఇంత‌కీ ఆ మూడు పండుగ‌లు ఏమిటి..? ఆ మూడు సినిమాలు ఏమిటి అనుకుంటున్నారా..? ముందుగా చెప్పుకోవాల్సింది ఈరోజే ప్రారంభించిన నేను లోక‌ల్ గురించి. ఈ చిత్రంలో నాని - కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్నారు. సినిమా చూపిస్త మావ డైరెక్ట‌ర్ త్రినాధ‌రావు న‌క్కిన ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇడియ‌ట్ త‌ర‌హాలో ఉండే ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

నేను లోక‌ల్ త‌ర్వాత చెప్పుకోవాల్సింది శ‌త‌మానంభ‌వ‌తి. ఈ చిత్రంలో శ‌ర్వానంద్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తున్నారు. వేగేశ్న స‌తీష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బొమ్మ‌రిల్లు చిత్రంలో తండ్రి కొడుకుల మ‌ధ్య అనుబంధాన్ని చూపిస్తే....శ‌త‌మానంభ‌వ‌తిలో తాత మ‌న‌వ‌డు మ‌ధ్య అనుబంధాన్ని చూపించ‌నున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించారు.

నేను లోక‌ల్, శ‌త‌మానంభ‌వ‌తి...ఈ రెండు చిత్రాల త‌ర్వాత చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ మూవీ. హ‌రీష్ శంక‌ర్ - అల్లు అర్జున్ కాంబినేష‌న్లో దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెలాఖ‌రులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభించే ఈ భారీ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా...క్రిస్మ‌స్, సంక్రాంతి, స‌మ్మ‌ర్ సీజ‌న్స్ లో ఏ సీజ‌న్ మిస్ కాకుండా ప‌క్కా ప్లాన్ రెడీ చేసిన దిల్ రాజు ఈ చిత్రాల‌తో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

రోజుకో పోస్ట‌ర్ తో ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తున్నజ‌న‌తా గ్యారేజ్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

నాగు గవర దర్శకత్వం లో ఆలీ హీరోగా సంజయ్ రామస్వామి

అదిత్, సుప్రియ శైల‌జ జంట‌గా రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి కీల‌క పాత్ర‌లో రూపొందిన విభిన్నకథా చిత్రం వీకెండ్ ల‌వ్.  ఈ విభిన్న క‌థా చిత్రాన్ని తెర‌కెక్కించి తొలి ప్ర‌య‌త్నంలోనే వైవిధ్య‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడుగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ నాగు గ‌వ‌ర‌.

సాయిధరమ్‌తేజ్ తో వర్క్ చేయడం నా అదృష్టం : 'తిక్క' రచయిత షేక్ దావూద్

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని నూత‌న నిర్మాత రోహిణ్ రెడ్డి నిర్మించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన తిక్క సినిమా ఈనెల 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

శిరీష్ సినిమాను క‌న్న‌డంలో రీమేక్ చేస్తానంటున్న‌....

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన చిత్రం శ్రీరుస్తు శుభ‌మ‌స్తు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకుంది.

నాగ అన్వేష్ ఏంజెల్ ఓపెనింగ్

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో నూతన దర్శకుడు బాహుబలి పళని దర్శకత్వంలో యువ నిర్మాత భువన్ సాగర్ నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యూత్ స్టార్ నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది.