దిల్‌రాజుకి టెన్ష‌న్... మాటిచ్చిన పవన్ కళ్యాణ్

  • IndiaGlitz, [Tuesday,March 24 2020]

దిల్‌రాజు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుంది. క‌రోనా వైర‌స్‌తో ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ స్తంభించింది. థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే ఈ క‌రోనా ఎఫెక్ట్ దిల్‌రాజుపై బ‌లంగానే ప‌డింద‌ట‌. ఎందుకో తెలుసా? దిల్‌రాజు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో వ‌కీల్‌సాబ్ సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చాలా సంవ‌త్స‌రాల నుండి ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని ఎదురుచూస్తున్న దిల్‌రాజుకు ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్‌తో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కింది. అన్నీ స‌జావుగా సాగితే మే 15న సినిమాను విడుద‌ల చేయాలని అనుకున్నాడు. కానీ క‌రోనా దెబ్బ‌కు సినిమా షూటింగ్ ఆగింది. ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. 20 శాతం పూర్త‌యితే దిల్‌రాజుకు టెన్ష‌న్ లేదు. అయితే ప‌వ‌న్ కోసం మ‌రోవైపు ఎ.ఎం.ర‌త్నం కాచుకుని కూర్చున్నాడు. క్రిష్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రి త‌న సినిమాను ప‌వ‌న్ ఎక్క‌డా వాయిదా వేస్తాడేమోన‌ని దిల్‌రాజుకి టెన్ష‌న్ మొద‌లైంది.

అయితే ఈ విష‌య‌మై ప‌వ‌న్‌ను దిల్‌రాజు క‌లిస్తే వ‌కీల్‌సాబ్ పూర్త‌యిన త‌ర్వాతే క్రిష్, ఎ.ఎం.ర‌త్నం సినిమాను స్టార్ట్ చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చాట‌. దీంతో దిల్‌రాజు గుండెల‌పై బ‌రువు దిగినట్లు అయ్యింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వకీల్‌సాబ్ బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్‌. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

ఏపీలో అన్ని బార్డర్లు మూసివేత.. రాకపోకలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు, సీఎస్‌లకు

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో 'పది' పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. కాగా.. ఈ క్రమంలో మార్చి 31 న జరగాల్సిన

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ కుర్ర హీరో నితిన్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే.

క్రితి శెట్టికి అవ‌కాశాల వెల్లువ

కన్న‌డ బ్యూటీ క్రితి శెట్టికి అవ‌కాశాలు వెల్తువెత్తుతున్నాయి. 2009లో క‌న్న‌డ చిత్రం ‘స‌రిగ‌మ‌’ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ త‌ర్వాత త‌మిళంలోనూ సినిమాలు చేసింది. అక్క‌డ నుండి

కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీస్‌లు రద్దు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా..