'కృష్ణాష్టమి' చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

  • IndiaGlitz, [Tuesday,February 23 2016]

టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలనునిర్మించిన ప్రముఖు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం కృష్ణాష్టమి. గోల్డెన్ స్టార్ సునీల్, నిక్కిగల్రాని, డింపుల్ చోపడే హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా ఫిభ్రవరి 19న విడుదలై మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ దస్ పల్లా హోటల్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా....

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ' కృష్ణాష్టమి విడుదలై ఈరోజుకు ఐదవరోజు. విడుదలైన అన్నీ చోట్ల ఈరోజుకు కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తూ సాగిపోతుంది. మల్టీప్లెక్స్ ల్లోనే కాకుండా బి, సి సెంటర్స్ లో కూడా స్టడీ కలెక్షన్స్ వస్తున్నాయి. సునీల్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సినిమాను తన భుజాలపై మోసి సక్సెస్ క్రెడిట్ సొంతం చేసుకున్నాడు. అలాగే నిక్కి క్లాస్ యాంగిల్, డింపుల్ మాస్ యాంగిల్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. థియేటర్ లో సినిమా చూసినప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. కామెడినీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సక్సెస్ పార్ట్ అయిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అన్నారు.

గోల్డెన్ స్టార్ సునీల్ మాట్లాడుతూ ' దిల్ రాజుగారు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. ఈ సినిమా కంటే ఆయనే బాగా కష్టపడ్డాడు. నిర్మాతగా సినిమాను తీశామా, రిలీజ్ చేశామా అని కాకుండా మా అందరి కంటే సినిమా సక్సెస్ కోసం కష్టపడ్డారు. ఈ సినిమాలో నన్ను డిగ్నైఫైడ్ గా చూపించడమే కాదు, కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. నేను హీరోగా చేసిన సినిమాలన్నింటిలో ఇదే పెద్ద బడ్జెట్ మూవీ. నాపై నమ్మకంతో ఇంత మంచి సినిమా ఇచ్చిన దిల్ రాజుగారికి థాంక్స్. సినిమాను ఫ్యామిలీ, మాస్ ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ సక్సెస్ మరిన్ని మంచి ప్రయోగాలు చేయవచ్చునే ఊపిరినిచ్చింది. దర్శకుడు వాసువర్మ ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. దినేష్ మంచి రీరికార్డింగ్ ఇచ్చాడు. ఛోటా కె.నాయుడుగారు మంచి సినిమాటోగ్రఫీ అందించారు. నిక్కి, డింపుల్ లతో పాటు అశుతోష్ రాణా, ముకేష్ రుషి తదితరులకు, టెక్నిషియన్స్ కు ధన్యవాదాలు'' అన్నారు.

దర్శకుడు వాసువర్మ మాట్లాడుతూ 'సినిమా విడుదలై మూడు రోజుల వరకు కలెక్షన్స్ సాధారణంగా బాగానే ఉంటాయి. సోమవారం రోజున కలెక్షన్స్ ఎలా ఉంటాయోననుకున్నాను. ఆఫీస్ కు వెళ్ళాను. కానీ శిరీష్ గారికి కలెక్షన్స్ బావున్నాయని వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యపీగా అనిపించింది. ఐదు రోజులవుతున్న కలెక్షన్స్ స్టడీగా సాగుతుండటంతో చాలా హ్యపీగా అనిపించింది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాసువర్మకు ఒక హిట్ అయినా ఇవ్వాలని దిల్ రాజుగారు ఏర్పరుచుకున్న టార్గెట్ ఈ సినిమాతో పూర్తయిందని అనుకుంటున్నాను. ప్రేక్షకుల సంతోషం కోసం మేం పడ్డ కష్టం, వారి సంతోషంతో మా ముఖాల్లో ఇప్పుడు సంతోషం కనపడుతుంది. సినిమాను పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.

నిక్కిగల్రాని మాట్లాడుతూ 'మంచి ప్రాజెక్ట్ లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు వాసువర్మ, నిర్మాత దిల్ రాజుగారికి థాంక్స్. ఆడియెన్స్ కు స్పెషల్ థాంక్స్'' అన్నారు.

డింపుల్ చోపడే మాట్లాడుతూ 'మంచి మాస్ టచ్ ఉండే రోల్ చేశాను. నా పాత్రకు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అన్నారు.

More News

మరో మెగా హీరో పక్కన రకుల్....

ప్రస్తుతం అనుష్క,సమంతల తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

'సరైనోడు' లో శ్రీకాంత్ ఎవరంటే...?

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం 'సరైనోడు'.

వెంకీ బాబు..బంగారం రిలీజ్ డేట్...

విక్టరీ వెంకటేష్ -యువ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం బాబు...బంగారం.

26న వ‌స్తున్న వీరి వీరి గుమ్మ‌డి పండు..

నూత‌న న‌టీన‌టులు రుద్ర‌, వెన్నెల జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు సాగ‌ర్ తెర‌కెక్కించిన చిత్రం వీరి వీరి గుమ్మ‌డి పండు.

అంద‌రూ చూడ‌ద‌గ్గ చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ క‌ళ్యాణ వైభోగ‌మే - నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్

అలా...మొద‌లైంది, అంత‌కు ముందు ఆత‌ర్వాత‌, హోరా హోరి...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌ను అందిస్తున్న అభిరుచి గ‌ల నిర్మాత కె.ఎల్. దామోద‌ర్ ప్ర‌సాద్. నాగ శౌర్య - మాళ‌విక నాయ‌ర్ జంట‌గా నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో దామోద‌ర ప్ర‌సాద్ నిర్మించిన తాజా చిత్రం క‌ళ్యాణ వైభోగ‌మే.