లైఫ్ లో డైరెక్షన్ చేయను - దిల్ రాజు

  • IndiaGlitz, [Tuesday,June 06 2017]

పాతిక సినిమాల‌ను నిర్మించిన నిర్మాత దిల్‌రాజు. ఈ పాతిక చిత్రాల్లో చాలా వ‌ర‌కు సూప‌ర్‌హిట్ చిత్రాలే ఉన్నాయి. ఇన్ని హిట్స్ సాధించ‌డానికి కార‌ణం స్క్రిప్ట్ సెలక్ష‌న్ నుండే దిల్‌రాజు ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. ర‌షెష్ చూసి ఏమైనా రీ షూట్స్ చేయ‌మ‌ని కూడా స‌ల‌హాలు కూడా ఇస్తుంటాడు. సినిమాపై ఇంత మంచి గ్రిప్ ఉన్న దిల్‌రాజు డైరెక్ష‌న్ చేయ‌వ‌చ్చు క‌దా అని..చేస్తాడేమో అని కూడా వార్త‌లు విన‌ప‌డుతుంటాయి.

ఇదే విష‌య‌మై డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ట్రైల‌ర్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కొంత మంది ద‌ర్శ‌కులు దిల్‌రాజు గురించి మాట్లాడారు. అయితే దిల్‌రాజు మాత్రం తాను లైఫ్‌లో డైరెక్షన్ చేయ‌న‌ని క్లారిటీ ఇచ్చేశాడు. ఎందుకంటే స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ చేయ‌డం, త‌ప్పొప్పులు చెప్ప‌డం చాలా సుల‌భమేన‌ని, అయితే ఓ సినిమాను ఎలా తీయాలనే ఆలోచ‌న ద‌ర్శ‌కుడికి మాత్ర‌మే ఉంటుంద‌ని, ద‌ర్శ‌కులు ఆ విష‌యంలో చాలా టెన్ష‌న్ ప‌డుతుంటారు. ఆ ప‌ని తాను చేయ‌లేను కాబ‌ట్టి తాను డైరెక్ష‌న్ చేయ‌లేన‌ని దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.

More News

'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' బన్నికి మా సంస్థంలో హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంది - దిల్ రాజు

'రేసుగుర్రం','సన్నాఫ్ సత్యమూర్తి','సరైనోడు' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా

'మామ్' ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్,థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై

'లోకల్ ఆటో' కొత్త చిత్రం టైటిల్ ఎనౌన్స్ మెంట్

నూతననటీనటులు సజీవ్ ,రాజు,లావణ్యరావ్ ,టీనా రాథోడ్ లను హీరోహీరోయిన్ లుగా పరిచయం చేస్తూ

బాహుబలిని దాటేస్తానంటున్న సల్మాన్...

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ ఈ నెల 25న ట్యూబ్లైట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇండోచైనా యుధ్ధ నేపథ్యంలో తెరకెక్కిన ట్యూబ్ లైట్ చిత్రాన్ని కబీర్ ఖాన్ తెరకెక్కించారు. చూ చూ అనే చైనా నటి సల్మాన్ జోడిగా నటించింది.

మోదీ మద్ధతు మహాభారతం కష్టాలు తీరుతాయా..

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా బడ్జెట్ అంటే ఐదు వందల కోట్లు కూడా దాటలేదు.