మ‌డ్డి టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి - దిల్‌రాజు

  • IndiaGlitz, [Wednesday,December 08 2021]

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం 'మడ్డి'. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ ప్రై.లి ప‌తాకంపై డిసెంబ‌ర్‌10న దిల్‌రాజు భారీగా విడుద‌ల‌చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠభ‌రితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి దిల్‌రాజు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా..

దిల్‌రాజు మాట్లాడుతూ - ''మ‌డ్డి సినిమా మేకింగ్ వీడియోలు మ‌రియు టీజ‌ర్, ట్రైల‌ర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. ప్యాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతున్న మ‌డ్డి అన్ని భాష‌ల్లో స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది'' అన్నారు.

ద‌ర్శ‌కుడు డా. ప్ర‌గ‌భ‌ల్ మాట్లాడుతూ - ''ఒక యూనిక్ మూవీని ప్రేక్ష‌కులకు అందించాల‌ని మా టీమ్ అంద‌రం ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి ఈ మూవీని తెర‌కెక్కించాం. ఆఫ్ రోడ్ మ‌డ్ రేస్ అనేది భార‌త‌దేశంలో కొత్త కానెప్ట్ కాబ‌ట్టి ప్రీ ప్రొడ‌క్ష‌న్‌, మేకింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఈ మూడు స్టేజెస్‌లో చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఈ క‌థ‌కి యాప్ట్ అయ్యే ఆర్టిస్టులు, ప్రాంతాల్ని ఎంచుకోవ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వ‌డం జ‌రిగింది. కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా.. రాక్షసన్ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్‌గా కేజీ రతీష్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. త‌ప్ప‌కుండా ప్యాన్ ఇండియా స్థాయిలో విజ‌యం సాధిస్తుంది'' అన్నారు

యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

More News

గమనం  కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి - శ్రియ స‌ర‌న్‌

గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: పింకీ కోరుకున్నది ఇదే.. అదరగొట్టేసిన సన్నీ, కాజల్ కన్నీళ్లు

బిగ్‌బాస్ 5 తెలుగులో సిరి, షణ్ముఖ్‌లు మరోసారి గొడవ పడ్డారు. హౌస్‌లో ఐకానిక్ ఎపిసోడ్స్‌గా చెప్పుకుంటున్న పరిస్ధితులను మరోసారి రిపీట్ చేశారు కంటెస్టెంట్స్.

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. కారుతో బైక్‌ని ఢీకొట్టిన సీరియల్ నటి లహరి, అరెస్ట్

ఇటీవలి కాలంలో సినీ తారలు, బుల్లితెర సెలబ్రెటీలు యాక్సిడెంట్ కేసుల్లో ఇరుక్కుని వార్తల్లోకెక్కుతున్నారు.

ఓటీటీలో రిలీజ్ కానున్న నాగచైతన్య ‘‘థ్యాంక్యూ’’.. ?

కరోనా వైరస్ పుణ్యామా అని ఓటీటీ మార్కెట్ బాగా అభివృద్ధి చెందుతోంది. థియేటర్లు మూతపడటం,

పుష్ప క్రూ మెంబర్స్‌కి బన్నీ సర్‌ప్రైజ్.. గోల్డ్ రింగ్స్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘‘పుష్ప’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.