close
Choose your channels

'పేట' నిర్మాత‌కు షాకిచ్చిన దిల్‌రాజు

Tuesday, January 8, 2019 • తెలుగు Comments

`పేట` నిర్మాత‌కు షాకిచ్చిన దిల్‌రాజు

అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు డిస్ట్రిట్యూట‌ర్‌, తెలుగులో `పేట` చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేనికి షాకిచ్చారు. `పేట` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థియేట‌ర్స్ మాఫియా అంటూ కామెంట్ చేసిన అశోక్ వ‌ల్ల‌భ‌నేని అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, యు.వి.క్రియేష‌న్స్‌ను పందులు, కుక్క‌లు అంటూ తిట్టారు.

ఆరు నెల‌ల‌కు ముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన  తెలుగు సినిమాల‌ను కాద‌ని .. నెల లోపు సినిమా హ‌క్కుల‌ను కొని  రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అనువాద సినిమాకు థియేట‌ర్స్ ఎలా ఇస్తామంటూ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయితే అంత‌ర్గ‌తంగా మాత్రం అశోక్‌కు దిల్‌రాజు షాకిచ్చాడు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌ను పేట సినిమాకు కేటాయిస్తార‌ని అనుకున్నారు. కానీ దిల్‌రాజు మాత్రం `పేట‌`కు ఆ థియేట‌ర్‌ను కేటాయించ‌లేదు. 

Get Breaking News Alerts From IndiaGlitz