దిల్‌రాజు మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్‌

తెలుగులో స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా రాణిస్తోన్న దిల్‌రాజు తెలుగుతో పాటు హిందీ సినిమాలను కూడా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో విజ‌య‌వంత‌మైన ప‌లు చిత్రాల‌ను దిల్‌రాజు హిందీలో కొంత మంది నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగులో విజ‌య‌వంతైన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్ క‌పూర్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో దిల్‌రాజు ఓ నిర్మాత వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇది కాకుండా తెలుగులోస‌క్సెస్ అయిన ‘ఎఫ్ 2’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నారు.

ఇది కాకుండా తెలుగులో ఈ ఏడాది విజ‌యంత‌మైన ‘హిట్‌’ సినిమాను బాలీవుడ్‌లో దిల్‌రాజు నిర్మించ‌బోతున్నాడ‌ని టాక్‌. తెలుగులో నాని నిర్మించిన హిట్ చిత్రానికి సంబంధించిన హిందీ రీమేక్ హ‌క్కుల‌ను దిల్‌రాజు చేజిక్కించుకున్నాడ‌ట‌. క‌రోనా ప్ర‌భావం కాస్త త‌గ్గు ముఖం ప‌ట్టిన త‌ర్వాత ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన ఆలోచ‌న‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌ని దిల్‌రాజు యోచిస్తున్నాడ‌ట‌. హిట్ రీమేక్ మ‌ల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునే అవ‌కాశం ఉంద‌ని దిల్‌రాజు గ‌ట్టిగా న‌మ్మ‌డంతోనే హిట్ సినిమాను రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌.

More News

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రంలో మరో హీరో

అగ్ర ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న ద‌ర్శ‌క‌త్వంలో

నేను కూడా అవ‌మానాల‌ను ఎదుర్కొన్నా:  ఐశ్వ‌ర్యా రాజేశ్‌

తెలుగుతో పాటు త‌మిళంలోనూ హీరోయిన్‌గా త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది ఐశ్వ‌ర్యా రాజేశ్‌. అయితే త‌న‌కు స‌క్సెస్ అంత సుల‌భంగా రాలేద‌ని ఐశ్వ‌ర్యా రాజేశ్ అంటున్నారు.

చిరు చిన్న‌ల్లుడి చ‌పాతీలు.. శ్రీజ సెటైర్‌

లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం, షూటింగ్స్ ఆగిపోవ‌డంతో సినీ తార‌లంద‌ర ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వీరంద‌రూ కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డ‌మే కాకుండా.

టీటీడీ ఆస్థులు అమ్మ‌కం.. నాగ‌బాబు ట్వీట్‌

మెగాబ్రదర్ నాగబాబు లాక్డౌన్ వల్ల షూటింగ్స్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఈయ‌న త‌న భావాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

‘నో పెళ్లి...’ వీడియో సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్ తేజ్‌, రానా సంద‌డి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`.