Director Madan : కృష్ణ మరణం నుంచి తేరుకోకముందే, టాలీవుడ్‌కి మరో షాక్... దర్శకుడు మదన్ హఠాన్మరణం

  • IndiaGlitz, [Sunday,November 20 2022]

సూపర్‌స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర సీమ షాక్‌కు గురైన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకు ఎన్నో సాంకేతిక హంగులు అద్ది, తన పేరిట ఎన్నో రికార్డులను రాసుకున్న కృష్ణ మరణం నుంచి ఇప్పట్లో టాలీవుడ్ కోలుకోలేదు. దీని నుంచి తేరుకోకముందే తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మదన్ హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో మదన్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. మదన్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఇదీ మదన్ ప్రస్థానం:

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మదన్ స్వస్థలం. ఆయన పూర్తి పేరు రామిగాని మదన్ మోహన్ రెడ్డి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మదన్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఎక్కువ. కాలేజీలో చదువుకున్న రోజుల్లో చిన్న చిన్న కథలను స్వయంగా రాసుకుని స్నేహితులతో కలిసి షార్ట్ స్టోరీస్‌లా తీసేవారు. అనంతరం హైదరాబాద్‌కు మకాం మార్చిన మదన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా రెండేళ్ల పాటు పనిచేశారు. తర్వాత కొన్ని సినిమాలకు కో రైటర్‌గానూ పనిచేసిన ఆయన.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులైన రచయితల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

‘ఆ నలుగురు’తో గుర్తింపు :

నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ హీరోగా 2004లో వచ్చిన ‘‘ఆ నలుగురు’’ చిత్రానికి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. ఈ సినిమా మదన్‌కు మంచిపేరు తీసుకొచ్చింది. అనంతరం ‘‘ఆ నలుగురు ఫిలిమ్స్’’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి పెళ్లయిన కొత్తలో చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. తర్వాత వరుసగా గుండె జల్లుమంది, ప్రవరాఖ్యుడు, గరం, గాయత్రి వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు.

More News

నువ్వేమైనా తోపా, తురుమా... ఆదిరెడ్డికి నాగ్ క్లాస్, శ్రీసత్య వెకిలి నవ్వులపై గరం

ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత చేటు చేస్తుందో గలాటా గీతూని చూసి బిగ్‌బాస్ ఇంటిలోని కంటెస్టెంట్స్ నేర్చుకోవచ్చు. తనకు మాత్రమే అన్ని తెలుసు అన్నట్లు వ్యవహరించడమే కాకుండా..

Bigg Boss 6 : ఆదర్శ జంటను విడదీస్తోన్న బిగ్‌బాస్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

బిగ్‌బాస్ 6 తెలుగు హొరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. సరికొత్త టాస్కులతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. షోకి అడ్డంకిగా మారిన వారిని, కంటెంట్ లేని వారిని

Geeta Sakshiga: రామ్ గోపాల్ వ‌ర్మ చేతుల మీదుగా ‘గీత సాక్షిగా’ నుంచి ‘అబ్బా అబ్బా ..’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

యువ‌కులు అమ్మాయిల‌పై త‌మ ప్రేమ‌ను, వ్యామోహాన్ని వ్య‌క్తం చేసే ప‌ద్ధ‌తులెన్నో..

Meta India : మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్ ... మన ఆంధ్రా యూనిర్సిటీలో చదివి ఉన్నత శిఖరాలకు

అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారతీయులు సారథులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Varasudu : మాది ఆపితే.. మీది ఆపుతాం.. టాలీవుడ్, కోలీవుడ్‌ల మధ్య 'వారసుడు' చిచ్చు

ఓటీటీల జోరుతో ఢీలా పడ్డ తెలుగు చిత్ర పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరేందుకు నానా తంటాలు పడుతోంది.